Wednesday, June 14, 2017

చింతచిగురు పచ్చడి

చింత చిగురు  పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి  ---
చింత చిగురు  ---   200  గ్రాములు 
ఎండుమిర్చి  ---  15
నూనె  ---  75  గ్రాములు
ఉప్పు  --  తగినంత 
పసుపు  --  కొద్దిగా 
తాలింపు  సామాను  ---
ఎండు  మిర్చి  ---  మూడు  
ఆవాలు  ---  ఒక స్పూను 
మెంతులు  --  పావు స్పూను
జీలకర్ర   --   అర  స్పూను 
ఇంగువ   --  కొద్దిగా 
తయారు  చేయు  విధానము .
ముందుగా  చింత  చిగురు  పుల్లలు ఏరి ఆకును  బాగా  రెండు  చేతులతో  నలిపి  ఉంచుకోవాలి.
తర్వాత  స్టౌ  మీద  బాండి  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి 
నూనె  బాగా  కాగాక  ఎండు  మిర్చి  వేసి   వేగాక తీసి పక్కకు  వేరేగా  పెట్టుకోవాలి. ఆ తర్వాత  చేతితో  బాగా  నలిపిన  చింత  చిగురును వేసి  మగ్గ నివ్వాలి .
మగ్గిన  చింత చిగురును  వేరేగా  ప్రక్కన  ఉంచుకోవాలి .
ఇప్పుడు  మళ్ళీ  స్టౌ  మీద  బాండి  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  ఎండు మిర్చి , మెంతులు , జీలకర్ర , ఆవాలు ,ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .
ఇప్పుడు  మిక్సీలో  ముందు  విడిగా  వేయించుకున్న ఎండు మిర్చి  , పసుపు , ఉప్పు  , వేసి  మెత్తగా   తిప్పుకోవాలి.
ఆ తర్వాత  వేయించి  ప్రక్కన  ఉంచుకున్న  చింత చిగురు  వేసి  ఆకు  నలిగేలా  మిక్సీ  వేసుకోవాలి.
చివరగా  వేయించిన  పోపు  వేసుకొని   మరోసారి   మిక్సీ  వేసుకుని   Bowl  లోకి  తీసుకోవాలి.
అంతే  రుచికరమైన  చింత చిగురు  పచ్చడి  భోజనము   లోకి  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి