Wednesday, June 14, 2017

బీరకాయ  పెసర పప్పు  పప్పు కూర.

బీరకాయ  పెసర పప్పు  పప్పు కూర.
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


కావలసినవి.
లేత  బీరకాయలు  --  5
చాయపెసరపప్పు  --  50  గ్రాములు .
పసుపు  ---  కొద్దిగా 
ఉప్పు  ---   తగినంత 
కారం   ---   స్పూను న్నర
పోపుకు  కావలసినవి .
నూనె  ---  మూడు  స్పూన్లు 
ఎండు మిరపకాయలు --  మూడు 
పొట్టు  మినపప్పు  --  స్పూను న్నర
జీలకర్ర  --   పావు  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
ఇంగువ  --   కొద్దిగా 
కరివేపాకు  ---  మూడు  రెబ్బలు.

తయారీ  విధానము  .
ముందుగా  బీరకాయలు  కడిగి 
పై  చెక్కు  తీసుకొని   మధ్యస్థంగా  ముక్కలుగా  తరుగు  కోవాలి .
చాయపెసరపప్పు  ఒకసారి  కడుగు కోవాలి .
కుక్కర్  లో ఒక అరగ్లాసు  నీళ్ళు పోసి   తరిగిన  బీరకాయ ముక్కలు మరియు  పెసరపప్పు  వేసి  స్టౌ  వెలిగించి   కుక్కర్   ఒక  విజిల్  రానిచ్చి  దింపేయాలి .
ఉప్పు  ముందు  వేయకూడదు .
వేసినట్లయితే  పెసర పప్పు  ఉడకదు .
ఉడికిన  తర్వాత  నీళ్ళు  ఎక్కువ   ఉంటే  వడకట్టండి .
కొద్దిగా   ఉంటే  ఉంచేయండి .   
ఆ తర్వాత  స్టౌ  మీద  బాండీ  పెట్టి
నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండు మిరప కాయ ముక్కలు , పొట్టు  మినపప్పు  , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ  మరియు కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకుని  ఉడికిని  బీరకాయ పెసరపప్పు  అందులో  వేసి  పసుపు , తగినంత  ఉప్పువేసి  ఒక అయిదు  నిముషాలు   మగ్గనివ్వాలి .
ఆ తర్వాత  కారం  వేసి  మరో  మూడు  నిముషములు  ఉంచి  దించుకోవాలి .
అంతే  ఘమ  ఘమ లాడే  ఇంగువ  వాసనతో  బీరకాయ  పెసర పప్పు  పప్పుకూర  సర్వింగ్ కు  సిద్ధం.
ఈ  కూర  పొడి  పొడిగా  ఉంటే  బాగుంటుంది .
అన్నం లోకి  మరియు  చపాతీల లోకి  కూడా ఈ  కూర  బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి