Thursday, June 1, 2017

పచ్చిమిర్చి చింతపండు పచ్చడి.


పచ్చిమిర్చి చింతపండు పచ్చడి.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 


ఇడ్లీ దోశె మరియు అన్నం లోకి పచ్చిమిర్చి చింతపండు పచ్చడి.తయారీ విధానము .
ముందుగా ఒక 50 .గ్రాముల చింతపండు 15 నిముషాల ముందు తగినన్ని నీళ్ళు పోసి నాన బెట్టుకుని , చిక్కగా రసం తీసుకోవాలి .
ఒక పది పచ్చి మిరపకాయలు తొడిమలు తీసి ఉంచు కోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి చింతపండు రసం పోయాలి .
అందులో పచ్చిమిరపకాయలు వేయాలి.
అందులోనే చిటికెడు పసుపు , కొద్దిగా బెల్లం మరియు తగినంత ఉప్పు వేయాలి.
ఒక పది నిముషాలు చింతపండు రసం పచ్చిమిరపకాయలకు పట్టి కాయలు మెత్తగా ఉడికే వరకు ఉంచి దింపు కోవాలి .
చల్లారాక ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా వేసుకుని వేరే Bowl లోకి తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటె పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి రెండు ఎండుమిర్చి , స్పూను శనగపప్పు , స్పూను మినపప్పు , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు రెండు రెబ్బలు కరివేపాకు వేసి పోపు పెట్టు కోవాలి .
అంతే ఘమ ఘమ లాడే పచ్చిమిర్చి చింతపండు చట్నీ ఇడ్లీ , దోశెలు మరియు అన్నం లోకి సర్వింగ్ కు సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి