Thursday, June 1, 2017

ములక్కాడ సాంబారు .

ములక్కాడ సాంబారు .
  ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి
కందిపప్పు -- 100 గ్రాములు 
చింతపండు -- 50 గ్రాములు.
ములక్కాడలు -- రెండు
సొరకాయ లేతది -- ఒక ముక్క
బెండకాయలు -- ఎనిమిది
ఉల్లిపాయలు -- రెండు 
పచ్చిమిర్చి -- నాలుగు 
కరివేపాకు -- మూడు రెమ్మలు
పసుపు - పావు స్పూను 
ఉప్పు -- తగినంత .
బెల్లం -- కొద్దిగా . 
 ఇష్టపడని వారు మానేయవచ్చు.
కొత్తిమీర -- ఒక కట్ట
----------------------------------------------
సాంబారు ముద్ద తయారీ విధానము .

కావలసినవి .
ఎండుమిరపకాయలు - 4
పచ్చి శనగపప్పు -- మూడు స్పూన్లు .
ధనియాలు --- మూడు స్పూన్లు 
జీలకర్ర -- పావు స్పూను 
బియ్యం -- రెండు స్పూన్లు 
మిరియాలు -- 6
ఇంగువ -- కొద్దిగా 
ఎండు కొబ్బరి --పావు చిప్ప 
చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
నూనె -- నాలుగు స్పూన్లు .

తయారీ విధానము .
స్టౌ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి , శనగపప్పు ,ధనియాలు, జీలకర్ర , మిరియాలు , ఇంగువ , ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా వేయించు కోవాలి .
చివరగా బియ్యము వేసి ఒక నిముషము సేపు ఉంచి దించుకోవాలి .

చల్లారాక మిక్సీలో ఈ దినుసులన్నీ వేసుకుని మెత్తగా పొడిలా వేసుకోవాలి .
మేము తగినన్ని నీళ్ళుపోసి దానిని మెత్తగా ముద్దలా చేసుకుంటాము .
పులుసుకు బాగా పడుతుందని ముద్దగా వేస్తాము .
----------------------------------------------
పొపుకు కావలసినవి.
ఎండుమిర్చి --- రెండు
ఆవాలు --- పావు స్పూను 
ఇంగువ -- కొద్దిగా 
నూనె -- రెండు స్పూన్లు

---------------------------------------------
సాంబారు తయారీ విధానము .
ముందుగా చింతపండు పావుగంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టి చిక్కగా రసం తీసుకోవాలి .
ఈ రసం ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి .
అందులో పసుపు , పచ్చి మిర్చి ముక్కలు , కరివేపాకు , తగినంత ఉప్పు వేయాలి .
బెల్లం ఇష్ట పడే వారు వేసుకోవాలి
గిన్నెలో ముప్పావు వంతు నీళ్ళు చింతపండు రసం లో పోసుకోవాలి .
కందిపప్పు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి అందులో తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ లో పెట్టి స్టౌ వెలిగించి కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ రాగానే స్టౌ ఆపెయాలి.
ఈ లోగా కూరలన్నీ ముక్కలుగా తరుగుకుని చింతపండు రసం సిద్ధం చేసుకున్న గిన్నెలో వేసి ,
స్టౌ మీద పెట్టి ముక్కలన్నీ మెత్తగా ఉడికే దాకా తెర్ల నివ్వాలి.

ఉడికిన కందిపప్పు గరిటతో మెత్తగా యెనిపి ఉడుకుతున్న పులుసులో వేసి మరో పది నిముషాలు తెర్లనివ్వాలి .
చివరగా పైన చెప్పిన విధంగా సిద్ధం చేసుకున్న సాంబారు ముద్ద అందులో వేసి మరో పది నిముషాలు మరగ నివ్వాలి.
దింపాక కొత్తిమీర వేసుకోవాలి .
తర్వాత పైన పోపు పెట్టుకోవాలి .
అంతే అన్నం లోకి , ఇడ్లీల లోకి మరియు పూరీల లోకి వేడి వేడిగా పొగలు కక్కుతున్న ములక్కాడ సాంబారు సర్వింగ్ కు సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి