Thursday, June 1, 2017

పచ్చిపులుసు.

పచ్చిపులుసు.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి .
చింతపండు --- 50 గ్రా
పెద్ద ఉల్లిపాయలు -- రెండు
ఉప్పు తగినంత
బెల్లం -- 40 గ్రా
తరిగిన కొత్తిమీర సరిపడా

పోపు .
ఎండుమిరపకాయలు 5
జీలకర్ర -- అర స్పూను
కరివేపాకు - రెండు రెబ్బలు

తయారీ విధానము .
చింతపండు లో నీళ్ళు పోసి పది నిముషములు నాన బెట్టు కోవాలి.
రసం తీసుకొని వడ కట్టుకొని ఒక అర లీటరు ప్రమాణం వచ్చేలా అందులో నీళ్ళు కలుపు కోవాలి .
ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
అందులో తగినంత ఉప్పు మరియు బెల్లం పొడి కలుపుకోవాలి .
ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా తరిగి అందులో కలుపుకోవాలి.
సన్నగా తరిగిన కొత్తిమీర అందులో కలుపుకోవాలి.
స్టౌ మీద బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు , జీలకర్ర వేసి వేగాక కరివేపాకు కూడా వేసి వేయించు కోవాలి .
తర్వాత మిక్సీలో ఈ వేగిన పోపు వేసి మెత్తగా పొడి చేసుకొని ఆ పొడి పచ్చి పులుసు లో వేసి గరిటతో బాగా కలుపుకోవాలి .
ఉల్లిపాయలు వేయించనక్కర లేదు .
పులుసు వెచ్చబెట్టే అవసరం లేదు .
ఇంక వేరే పోపు వేయనక్కర లేదు.
పచ్చి మిర్చి వేయనక్కర లేదు .
ఇంగువ వేసే అవసరం లేదు.

ఎంతో రుచిగా ఉండే పచ్చి పులుసు రెడీ .
మొన్న ఒకరింట్లో గట్టిగా ఉండి ఎర్రగా పండిన రెండు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఈ ఉల్లిపాయల పచ్చి పులుసులోనే వేసి వడ్డించారు .
అలా కలిపినా చాలా బాగుంది .
కాంబినేషన్ మీరే చెప్పండి.
కంది పచ్చడా ?
కంది పొడా ?
కందిపచ్చడి మాదిరిగానే వేయించి చేసిన పచ్చి శనగఫప్పు ఫచ్చడా ?

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి