Thursday, June 1, 2017

కొబ్బరి మామిడికాయ పచ్చడి.

సింపుల్ గా కొబ్బరి మామిడికాయ పచ్చడి.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుముకోండి.
ఒక పుల్లని మామిడి కాయ చెక్కు తీసి ముక్కలుగా తరగండి .
స్టౌ మీద బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి ఆరు ఎండుమిరపకాయలు , పావు స్పూను మెంతులు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు కాస్త ఇంగువ కాస్త కరివేపాకు వేసి పోపు వేయించుకోండి .
తర్వాత పోపు మిక్సీలో వేసి కాస్త పసుపు , మూడు పచ్చిమిర్చి , తగినంత ఉప్పు వేసి మెత్తగా వేసుకుని తర్వాత మామిడి ముక్కలు , కొబ్బరి తురుము వేసి తిప్పుకోండి.
కొబ్బరి మామిడి కాయ పచ్చడి సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి