Wednesday, June 7, 2017

కొబ్బరి పొడి .

కొబ్బరి  పొడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్ 
కావలసినవి .
ఎండు కొబ్బరి  చిప్పలు  --  రెండు
ఎండు  మిరపకాయలు  --  25 
జీలకర్ర   ---   రెండు స్పూన్లు 
పొట్టు తీయని వెల్లుల్లి  రెబ్బలు --  15.
(  వెల్లుల్లి   ఇష్టం  లేని  వారు ,  వెల్లుల్లి   బదులుగా   మరో  స్పూను   జీలకర్ర   వేసుకోండి )
ఉప్పు  --  తగినంత .

ముందుగా  స్టౌ  వెలిగించి మంట  సిమ్ లో  పెట్టి ,  చాలా సన్నని  సెగన  రెండు  ఎండు  కొబ్బరి  చిప్పలు దగ్గరే  ఉండి  చూసుకుంటూ  రెండు  వైపులా  కాల్చుకోవాలి .సెగ  ఎక్కువైతే  కొబ్బరి   చిప్పలు  అంటుకునే  ప్రమాదం  ఉంది .

బంగారు  రంగు  లేదా  లైట్ గా నల్ల రంగు  వచ్చేదాకా   కాల్చుకోవాలి . చల్లారిన  తర్వాత  కాలిన  రెండు చిప్పల్ని  చిన్న , చిన్న ముక్కలుగా కట్  చేసుకొని   విడిగా  ఒక ప్లేటులో  ఉంచుకోండి .

ఇప్పుడు  మళ్ళీ  స్టౌ  వెలిగించి బాండి పెట్టి నూనె  వెయ్యకుండా  
ఎండుమిరపకాయలు , జీలకర్ర , ఉప్పు  మూడింటిని  బాగా  వేయించుకోవాలి . చల్లారగానే ముందుగా  ఎండుమిరపకాయలు  , జీలకర్ర  , ఉప్పును  మిక్సీలో  వేసి  మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి .

ఆ తర్వాత  స్టౌ మీద కాల్చిన  ఎండు కొబ్బరి ముక్కలు  వేసి మెత్తగా గ్రైండ్  చేసుకోవాలి .

చివరగా  పొట్టు తీయని  వెల్లుల్లి  రెబ్బలు  వేసి  మరోసారి  మిక్సీ  వేసుకోవాలి .

వెల్లుల్లి   వాడని వారు , ఇష్టం లేని  వారు  మానేయవచ్చు .

ఇబ్బందేం  లేదు.

అంతే  ఘమ  ఘమ లాడే  వాసనలతో  ఎండు కొబ్బరి పొడి  సిద్ధం.


వేడి  వేడి  అన్నంలో  నెయ్యి వేసుకొని   ఈ  కొబ్బరి  పొడి  వేసుకుని  తింటే  ఆ రుచి  అద్భుతం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి