Thursday, June 1, 2017

దోసకాయ చింతకాయ పచ్చడి

దోసకాయ చింతకాయ పచ్చడి 
  ఆలూరి కృష్ణ ప్రసాద్ 


కావలసినవి .
పసుపు రంగు గట్టి దోసకాయ --- ఒకటి.
పై చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
కొత్త చింతకాయ తొక్కు -- ఒక కప్పు .
పచ్చిమిరపకాయలు -- 12
కొత్తి మీర --- రెండు కట్టలు .
మరి కాస్త వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది .

కట్టలు విడదీసి కాడలు తీసేసి కొత్తిమీర శుభ్రం చేసుకోవాలి .
ఉప్పు --- తగినంత
ఉప్పు -- చింత తొక్కులో ఉప్పు ఉంటుంది కనుక ఎక్కువ పట్టదు . చూసి వేసుకోండి .
పసుపు --- కొద్దిగా .
పోపుకు .
ఎండుమిరపకాయలు -- 6
మెంతులు --- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా
నూనె --- 50 గ్రాములు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె పోయాలి.
నూనె బాగా కాగనివ్వాలి .
నూనె బాగా కాగగానే మెంతులు , ఎండుమిరపకాయలు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు బాగా వేగనివ్వాలి .
ఎక్కువ నూనె ఉంటే ఆఖరున పచ్చడిలో కలుపుకోవచ్చు.
బాండీ లోనే ఉంచేయండి .
పోపు చల్లారగానే ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసి మిక్సీ మెత్తగా వేసుకోవాలి .
తరువాత పచ్చిమిర్చి , చింత తొక్కు మరియు పోపు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి
చివరగా దోసకాయ ముక్కలు మరియు కొత్తిమీర వేసి ఒకే ఒక్కసారి దోసకాయ ముక్కలు నలగ కుండా మిక్సీ వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని బాండీలో కాగిన మిగిలిన నూనె అందులో పోసి గరిటతో ముక్కలు పచ్చడి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే దోసముక్కలు చింతకాయ పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి