Thursday, June 1, 2017

పొట్టు మినపప్పు తో పచ్చడి .

పొట్టు మినపప్పు తో పచ్చడి .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి.
పొట్టు మినపప్పు -- 150 గ్రాములు.
ఎండుమిరపకాయలు -- 8 నుండి 12 
చింతపండు -- 30 గ్రాములు 
ఉప్పు -- తగినంత 
బెల్లం ( ఇష్టమైతే ) -- చిన్న ముక్క 
పసుపు -- కొద్దిగా 
ఇంగువ -- కొద్దిగా 
కరివేపాకు -- కొద్దిగా 
జీలకర్ర -- పావు స్పూను 
నూనె -- మూడు స్పూన్లు

తుయారీ విధానము .
ముందుగా చింతపండు విడదీసి తడిపి ఉంచుకోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే పొట్టు మినపప్పు , ఎండుమిరపకాయలు , కరివేపాకు , జీలకర్ర , ఇంగువ వేసి చివరగా కొద్దిగా పసుపు వేసి దింపు కోవాలి.
చల్లారిన పిదప చింతపండు , ఉప్పు , బెల్లం, వేయించిన పోపు వేసి తగినన్ని నీళ్ళు పోసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి.
అంతే మన పెద్దలు చేసిన నేర్పిన పొట్టు మినపప్పు పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
ఈ పచ్చడి ఫ్రిజ్ లో ఉంచుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి