Tuesday, June 6, 2017

పాఠోళి .

పాఠోళి 
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 


ఈ  పాఠోళి  తయారు  చేయడానికి  మామూలు  శనగలు  కాని , పచ్చి శనగపప్పు  కాని  వాడుకోవచ్చు .
అందులో  మరో  కూర  కలుపు  కోదల్చుకున్నవారు  గోరు  చిక్కుడు  కాయలు  గాని , బీన్స్  కాని  ఉపయోగించవచ్చు .లేదా  మరో  కూర  కలుపకుండా  కూడా  చేసుకోవచ్చు .

కావలసినవి  మరియు  తయారీ  విధానము .

మామూలు  శనగలు  అయితే  ముప్పావు  కప్పు  తీసుకొని , అందులోనే  ఒక  గరిటెడు  చాయపెసరపప్పు వేసుకొని   ఒక  నాలుగు  గంటల  పాటు  నాన బెట్టు కోవాలి .
పచ్చి  శనగపప్పు తో  అయితే  ఒక కప్పు   పచ్చి  శనగపప్పు , ఒక  గరిటెడు  చాయపెసరపప్పు  కలిపి  ఓ  మూడు గంటలు  నానబెట్టు కొవాలి. 
ఆ తర్వాత నీళ్ళు  వడగట్టు  కోవాలి .

గోరు  చిక్కుడు   కాయలు  అయితే  ఒక  150  గ్రా.  తీసుకోవాలి .
బీన్స్  అయితే  ఓ  200 గ్రా.  తీసుకోవాలి .
 వీటి  ఈనెలు  తీసి వేసి  చిన్న  చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి .
తదుపరి  కుక్కర్  లో  తగినన్ని   నీళ్ళు  పోసి  తరిగిన   ముక్కలు  కొద్దిగా   ఉప్పు కొంచెం  పసుపు   వేసి  రెండు  విజిల్స్  రానిచ్చి , ఆ తర్వాత  వడకట్టి  వేరే  ప్లేటులో  ఉంచు  కోవాలి.
ఆ తర్వాత  నానబెట్టిన  శనగలు , చాయపెసరపప్పు  గాని  లేక పచ్చి శనగపప్పు , చాయ పెసర పప్పు  కాని  మిక్సీలో  వేసుకొని , అందులో  రెండు  పెద్ద ఉల్లిపాయలు తరిగిన  ముక్కలు , పై  చెక్కు   తీసిన  చిన్న  అల్లం   ముక్క , అర స్పూను  జీలకర్ర ,  స్పూను  కారం , తగినంత   ఉప్పు (  ఇష్ట మైన వారు  రెండు  వెల్లుల్లి  రెబ్బలు  )  వేసి కొంచెం   కచ్చా పచ్చాగా  మిక్సీ  వేసుకోవాలి .
ఆ మిశ్రమాన్ని   వేరేగా  తీసి పెట్టుకోవాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండి  పెట్టి  అయిదు  స్పూన్లు   నూనె  వేసి , నూనె  బాగా కాగగానే  వరుసగా మూడు ఎండుమిరపకాయల   ముక్కలు , స్పూను   మినపప్పు పావు స్పూను  జీలకర్ర ,అరస్పూను  ఆవాలు , రెండు  రెమ్మల  కరివేపాకు   వేసి పోపు  వేగగానే   ఉడికించిన  ముక్కలు , రుబ్బిన  మిశ్రమం  ఒకేసారి  వేయాలి . ఒక  అర  గ్లాసు  నీళ్ళు  పోయాలి .
స్టౌ  సన్నని  సెగలో  మార్చి  అట్లకాడతో  కలుపుకుంటూ   కూరను  బాగా  ఒక  పదిహేను నిముషములు  మగ్గనివ్వాలి .


ఆ తర్వాత  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి . అంతే .  ఎంతో  రుచిగా  ఉండే  పాఠోళీ  కూర  భోజనము లోకి మరియు  రోటీల లోకి కూడా  బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి