Thursday, June 1, 2017

ఆలూ బోండా.

ఆలూ బోండా.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తయారీ విధానము .
రెండు బంగాళాదుంపలు ఉడికించుకోవాలి.
రెండు ఉల్లిపాయలు ముక్కలుగా తరుగు కోవాలి
మూడు పచ్చిమిర్చి ముక్కలుగా తరుగు కోవాలి
తగినంత కరివేపాకు కొత్తిమీర సన్నగా తరుగు కోవాలి
మూడు స్పూన్లు పచ్చి బఠాణీలు సిద్ధం చేసుకోవాలి

ముందు కూర తయారీ విధానము
స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి
నూనె బాగా కాగగానే మూడు ఎండుమిరపకాయల ముక్కలు , స్పూను శనగపప్పు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , పచ్చిమిర్చి , కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి .

తర్వాత ఉల్లిపాయల ముక్కలు , పసుపు , తగినంత ఉప్పు , స్పూను కారం , పచ్చి బఠాణీలు వేసి బాగా మగ్గనివ్వాలి .
ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపలు చేతితో చిదిమి వేయాలి.
చిన్న స్పూను శనగపిండి వేయాలి.
కూర ఉండగా చేయడానికి శనగపిండి వేస్తే కూర గట్టిగా ఉంటుంది .
కూర మగ్గగానే తరిగిన కొత్తిమీర వేసి దింపి చల్లారాక గుండ్రంగా నిమ్మకాయంత సైజులో ఉండలు చేసుకొని వేరే ప్లేటులో పెట్టు కోవాలి .
షుమారు 100గ్రాముల శనగపిండి ఒక గిన్నెలో తీసుకొని చాలా కొంచెం ఉప్పు చాలా కొంచెం కారం ( ఎందుకంటే ఇందాకే కూరలో వేసాము కదా )
చిటికెడు వంట సోడా వేసి తగినన్ని నీళ్ళు పోసి మరీ పల్చగా కాకుండా బజ్జీల పిండిలా కలుపు కోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి 200 గ్రా, నూనె పోసి నూనె పోగలు వచ్చే విధంగా కాగనివ్వాలి .
తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉండల్ని శనగపిండిలో ముంచి బంగారు రంగులో వేగనివ్వాలి .
అంతే వేడి వేడి ఆలూ బోండా మధ్యాహ్నము అల్పాహారానికి రెడీ.
దీనిని చింతపండు , పచ్చిమిర్చి బెల్లం ఉప్పు కొత్తిమీర అల్లం ముక్క మిక్సీ వేసి నెయ్యి పోపు పెట్టుకున్న అల్లం కొత్తిమీర చట్నీతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి