Thursday, June 1, 2017

పెసర పప్పుతో పప్పు చారు.

పెసర పప్పుతో పప్పు చారు.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి.
చాయపెసరపప్పు - 100 గ్రా
చింతపండు -- 30 గ్రా
పచ్చి మిర్చి -- 4
కరివేపాకు -- రెండు రెబ్బలు
పసుపు -- కొద్దిగా 
కొత్తిమీర -- ఒక కట్ట

పోపు కు కావలసినవి .
ఎండు మిర్చి -- రెండు
జీలకర్ర -- పావు స్పూను 
ఆవాలు -- అర స్పూను
ఇంగువ --- తగినంత 
మెంతులు -- కొద్దిగా

తయారీ విధానము .
కుక్కర్ లో ఒక గిన్నె లో పెసర పప్పు తగినన్ని నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి మెత్తగా ఉడికించాలి .
చింతపండు పావు గంట సేపు నీళ్ళలో నాన బెట్టి రసం తీసుకోవాలి .
పప్పును గరిటెతో బాగా మెత్తగా యెనపాలి.
ఒక గిన్నెలో ఉడికిన పప్పు , చింతపండు రసం, తరిగిన పచ్చిమిర్చి , కరివేపాకు మరియు రెండు గ్లాసుల నీళ్ళు , పసుపు , తగినంత ఉప్పు వేసి బాగా తెర్ల నివ్వాలి.
ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి .
కాగిన తర్వాత గరిటెలో నూనె వేసి ఎండుమిర్చి , జీలకర్ర , ఆవాలు , మెంతులు , ఇంగువ వేసి పోపు పెట్టు కోవాలి.
పైన కొత్తిమీర తరిగి వేసుకోవాలి .
పప్పు చారు కనుక బెల్లం వేయ నవసరం లేదు.
వెల్లుల్లి ఎనిమిది రేకలు పై పొట్టు తీసి ఇంగువ బదులుగా పోపులో వేసుకున్నా రుచిగా ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి