Saturday, June 10, 2017

బీరకాయ టమోటా పచ్చడి

బీరకాయ  టమోటా  పచ్చడి   
ఆలూరు కృష్ణప్రసాదు .

కావలసినవి .
లేత  బీరకాయలు  --   మూడు
టమోటాలు   ---   మూడు
పచ్చిమిర్చి   ---  నాలుగు
కరివేపాకు  ---  మూడు రెబ్బలు
కొత్తిమీర   ---  ఒక  కట్ట 
తాలింపుకు .
ఎండు మిర్చి  ---  నాలుగు
మినపప్పు  ---  ఒక స్పూను
 పచ్చి శనగపప్పు  --  ఒక  స్పూను 
ఆవాలు  ---   అర  స్పూను 
జీలకర్ర   ---  అర  స్పూను
పసుపు  --  కొద్దిగా 
ఇంగువ  --  తగినంత
ఉప్పు  --   తగినంత 
ఉల్లిపాయలు  ---  రెండు.
( సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి )
ధనియాలు  ---  ఒక  స్పూను .
నూనె  ---   అయిదు  స్పూన్లు 
చింతపండు  --  కొద్దిగా 
తయారు చేయు విధానము .
ముందుగా   బీరకాయలు  చెక్కు తీసి  చిన్న  ముక్కలుగా   తరుగు కోవాలి.
టమోటాలు  కూడా  చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి. 
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి మూడు స్పూన్లు నూనె  వేసి  బీరకాయ  ముక్కలు , టమోటా  ముక్కలు , పచ్చి మిర్చి  మరియు
పసుపు కొద్దిగా   వేసి  ముక్కలు  మెత్తగా   మగ్గనివ్వాలి. 
తర్వాత  స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు స్పూన్లు   నూనె  వేసి  ఎండు మిర్చి , శనగపప్పు , మినపప్పు , ధనియాలు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , కరివేపాకు   వేసి  పోపు  వేయించుకోవాలి. 
పోపు  చల్లారాక.
  ఎండు మిర్చి , కొద్దిగా   చింతపండు , ఉప్పు  కలిపి  మిక్సీ వేయాలి .
తదుపరి  మిగిలిన  పోపు  వేసి  ఒకసారి  మిక్సీ వేసుకోవాలి.
తర్వాత  మగ్గిన  బీరకాయ ముక్కలు , టమోటా ముక్కలు మరియు కొత్తిమీర   వేసి  మరీ  పేస్టులా  కాకుండా   మిక్సీ వేసుకుని  వేరే  Bowl  లోకి  తీసుకోవాలి.
అంతే  బీరకాయ  టమోటా  పచ్చడి   అన్నం లోకి  మరియు  చపాతీల లోకి  సర్వింగ్  కు  రెడీ.
Optional .
*********
మీకు  పచ్చి  ఉల్లిపాయలు   ఇష్టమైతే  సన్నగా  తరిగిన  ఉల్లిపాయ ముక్కలు  పచ్చడిలో  కలుపుకోండి.
లేదా  మానేయవచ్చు .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి