Saturday, June 10, 2017

కాకరకాయ శనగపిండి కూర

కాకరకాయ శనగపిండి కూర
ఆలూరుకృష్ణప్రసాదు .



సింపుల్ గా  కాకరకాయ  శనగపిండి --  ఉల్లిపాయ  కూర.
ఒక  350  గ్రాముల  కాకరకాయలను  మధ్యకి  తరిగి  ముక్కలు  చేయకుండా  మధ్యలో  గాటు  పెట్టుకోండి.
ఒక  నాలుగు   పెద్ద ఉల్లిపాయలు   ముక్కలుగా  తరుగు కోండి.
ఒక  అర  కప్పు  శనగపిండి  తీసుకోండి .
అందులో  తగినంత   ఉప్పు , రెండు స్పూన్లు   కారం  వేసి చేత్తో   బాగా  కలుపుకోండి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి ఒక  100 గ్రా. నూనె వేసి , నూనె  బాగా  కాగగానే  సగానికి  తరిగి   గాటు పెట్టిన  కాకరకాయలను   నూనెలో  వేసి  ఎర్రగా   వేయించుకోండి.  విడిగా  ఉంచుకోండి.
మళ్ళీ బాండీలో  నూనె  వేసి  నూనె  కాగగానే  ముక్కలుగా   తరిగి  ఉంచిన  ఉల్లిపాయలు వేసి  బంగారు  రంగు  వచ్చే వరకు  వేయించుకోండి .
ముక్కలు  వేగగానే  ఉప్పు , కారం  కలిపిన  శనగపిండి  వేసి , శనగపిండి  పచ్చి  వాసన  పోయి  ఉల్లిపాయల  తో  కలసి  కమ్మని  వాసన  వచ్చేదాక  వేయించుకోండి .
చల్లారగానే  ఈ  మిశ్రమాన్ని   వేయించిన  కాకరకాయల్లో  కూరండి .  విడిగా  కొంత  పొడి  ఉంచుకోండి.
స్టౌ  మీద  బాండీ పెట్టి  నూనెపోసి  నూనె  పొగలు  రాగానే  ఒక్కో  ముక్కలో  రెండు  స్పూన్లు   వేడి  నూనె  పోసుకోండి.
అంతే  కాకరకాయ తో  శనగపిండి  మరియు  ఉల్లిపాయ   కూర  సర్వింగ్  కు  సిద్ధం.
వేడి  వేడి  అన్నంలో  నెయ్యి వేసుకుని   విడిగా  ఉంచిన 
కూరపొడి   కలుపుకుని  శనగపిండి ఉల్లిపాయలతో  కూరిన  కాకరకాయలు  తింటుంటే  ---

ఆహా ఏమి  రుచి.
అనరా  మైమరచి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి