Monday, May 29, 2017

బెండకాయ కాప్సికమ్ కొత్తిమీర కారం.

బెండకాయ కాప్సికమ్ కొత్తిమీర కారం.
ఆలూరి కృష్ణ ప్రసాద్

ప్రియమిత్రులందరికీ
ఈ రోజు మరో వెరైటీ కూర...
*****************************
కావలసినవి .

బెండ కాయలు లేతవి - 350 గ్రా
కాప్సికమ్ - 4 లేదా పావు కిలో
పచ్చిమిర్చి -- 8
కరివేపాకు - మూడు రెబ్బలు
కొత్తిమీర -- రెండు కట్టలు
అల్లం -- చిన్న ముక్క
నూనె - మూడు స్పూన్లు 
పసుపు -- తగినంత

పోపు వేయుటకు.
ఎండు మిర్చి - 4
మినపప్పు - ఒక స్పూను
ధనియాలు - ఒక స్పూను
జీలకర్ర - అర.స్పూను
ఆవాలు - అర స్పూను

ముందుగా బెండకాయలు, కాప్సికమ్ ముక్కలుగా తరిగి విడిగా వేరే ప్లేట్లలో పెట్టుకోవాలి .
కొత్తిమీర శుభ్రం చేసుకొని కొంచెం కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి ,
అల్లం ముక్క, కొత్తిమీర మరియు తగినంత ఉప్పువేసి కచ్చా పచ్చాగా వేసుకోవాలి.

ఆ తర్వాత స్టౌ మీద బాండి పెట్టి నూనె వేసి నూనె బాగా కాగాక
ఎండుమిర్చి , మినపప్పు , ధనియాలు , జీలకర్ర , ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలి . ఆ తర్వాత 
కరివేపాకు కూడా వేయాలి .

ఇప్పుడు బెండకాయ ముక్కలు పసుపు వేసి అయిదు నిముషాల పాటు మగ్గాక, కాప్సికమ్ ముక్కలు వేసి మరో పది నిముషాలు మగ్గనివ్వాలి.
ఆ తర్వాత కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి ముద్దను వేసి మరో మూడు నిముషాలు ఉంచి దింపేయాలి .

అంతే బెండకాయ కాప్సికమ్ కొత్తిమీర కారం కూర సర్వింగ్ కు రెడీ.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి