Tuesday, May 30, 2017

దొండకాయ వేపుడు కారం.

దొండకాయ వేపుడు కారం.
ఆలూరి కృష్ణ ప్రసాద్

కాయల పళంగా .

లేత చిన్న దొండకాయలు ఒక అర కిలో తీసుకుని నీళ్ళలో కడిగి కాయను నాలుగు పక్షాలుగా చేసుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే పదిహేను ఎండు మిరపకాయలు , పులుసు గరిటెడు పచ్చి శనగపప్పు , గరిటెడు మినపప్పు , స్పూనున్నర జీలకర్ర వేసి కమ్మని వేపు వచ్చే వరకు వేయించుకుని చల్లారగానే తగినంత ఉప్పు వేసి మిక్సీ లో కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి .
ఈ కారం వేరే పళ్ళెంలోకి తీసుకుని కాయలలో కూరుకోవాలి .
కాస్త కారం చివరలో కలిపేందుకు విడిగా ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టుకొని ఓ 100 గ్రాముల నూనె వేసి , నూనె బాగా కాగగానే కారం కూరిన దొండ కాయలు నూనెలో వేసుకుని మీడియం సెగన పైన నీళ్ళ మూత పెట్టి , మధ్య మధ్యలో కదుపుతూ బాగా మగ్గనివ్వాలి .
చివరలో మూత తీసి విడిగా ఉంచుకున్న పొడి వేసి మరో అయిదు నిముషాలు వేగనిచ్చి దింపుకోవాలి .
అంతే . ఎంతో రుచికరమైన కాయల పళంగా దొండకాయ వేపుడు కారం కూర సర్వింగ్ కు రెడీ .
ఫోటో --- ఈ రోజు ఉదయం మా ఇంట్లో చేసిన దొండకాయ వేపుడు కారం కూర .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి