Thursday, May 25, 2017

గుత్తి వంకాయ కొబ్బరి మసాలా కూర .

గుత్తి వంకాయ కొబ్బరి మసాలా కూర .
ఆలూరి కృష్ణ ప్రసాద్
కావలసినవి .
చిన్న సైజు నీలం రంగు లేత గుండ్రని వంకాయలు -- అర కిలో
ఎండుమిరపకాయలు -- పది
ఎండు కొబ్బరి -- పావు చిప్ప
పచ్చి శనగపప్పు -- పావు కప్పు.
చాయ / పొట్టు మినపప్పు ---పావు కప్పు
ధనియాలు --- పావు కప్పు
జీలకర్ర --- చాలా కొద్దిగా
ఆవాలు -- కొద్దిగా
ఇంగువ -- కొద్దిగా
అల్లం -- చిన్న ముక్క
పెద్ద ఉల్లిపాయ -- ఒకటి .
నూనె --- 150 గ్రాములు .
ఉప్పు -- తగినంత
తయారీ విధానము.
ఎండు కొబ్బరి చిన్న ముక్కలు గా చేసుకోవాలి .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , ధనియాలు , ఎండు కొబ్బరి ముక్కలు , జీలకర్ర , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు వేయించు కోవాలి .
అల్లం పై చెక్కు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి .ఉల్లిపాయ ముక్కలుగా చేసుకోవాలి .
నీళ్ళలో వంకాయలు వేసి గుత్తి వంకాయకూర కనుక నాలుగు పక్షాలుగా చేసుకోవాలి .

ఇప్పుడు మిక్సీ లో వేయించుకున్న మిశ్రమము , అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఈ మిశ్రమాన్ని వంకాయలలో కూరు కోవాలి .కొద్దిగా మిశ్రమము విడిగా ఉంచుకోవాలి .
తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో మొత్తము నూనె వేసి , నూనె బాగా కాగగానే మసాలా కూరిన వంకాయలు వేసి పైన నీళ్ళ గిన్నె మూత పెట్టి కాయలు చితకకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఈ కూరని బాగా మగ్గనివ్వాలి .
చివరగా విడిగా ఉంచుకున్న మసాలా కూడా వేసి ఇంక మూత పెట్టకుండా మరో ఐదు నిముషాలు ఉంచితే మసాలా కూరకి పట్టి వంకాయలు కూడా బాగా మగ్గుతాయి .
ఆ తర్వాత దింపి వేరే Dish లోకి తీసుకోవాలి .
అంతే ఘమ ఘమ వాసనలతో వంకాయ కొబ్బరి మసాలా కూర అన్నం లోకి సర్వింగ్ కు సిద్ధం .
ఫోటో : --- ఈ రోజు మధ్యాహ్నము భోజనము లోకి మేము చేసుకున్న గుత్తి వంకాయ కొబ్బరి మసాలా కూర. చాలా చాలా రుచిగా కుదిరింది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి