Saturday, May 27, 2017

పొదినా పొడి .

పొదినా పొడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్
కావలసినవి .
పొదినా ఆకులు వలుచుకోవాలి
--- ఒకటిన్నర కప్పు
ఎండుమిరపకాయలు -- 12
ధనియాలు -- ముప్పావు కప్పు
చాయ / పొట్టు మినపప్పు --పావు కప్పు
నూనె --- నాలుగు స్పూన్లు
చింతపండు -- ఉసిరి కాయంత
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
ముందుగా పొదినా ఆకు వలుచుకుని సిద్ధం చేసుకోవాలి .
తడి లేకుండా ఆర బెట్టు కోవాలి .
స్టౌ మీద బాండి పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి , ధనియాలు , మినపప్పు , వేసి బంగారు రంగులో వేయించు కోవాలి .
తర్వాత వలిచి ఉంచుకున్న పొదినా ఆకు కూడా వేసి బాగా వేయించు కోవాలి .
ఇప్పుడు మిక్సీ లో ముందుగా ఎండుమిరపకాయలు , విడదీసిన చింతపండు , తగినంత ఉప్పువేసి మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేయించిన మిశ్రమం అంతా వేసి మీక్సీ వేసుకోవాలి .
తర్వాత సీసా లో భద్ర పర్చుకోవాలి .అంతే ఘమ ఘమ లాడే పొదినా వాసనతో పొదినా పొడి సిద్ధం .
ఈ పొడి అన్నం లోకి , ఇడ్లీల లోకి మరియు దోశెల లోకి కూడా చాలా బాగుంటుంది .
పది రోజులు పైగా నిల్వ ఉంటుంది .
ఫోటో : -- ఈ రోజు మధ్యాహ్నము భోజనము లోకి కొట్టిన పొదినా పొడి .చాలా రుచిగా కుదిరింది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి