Monday, May 29, 2017

పెసర అప్పడాల పిండి

పెసర అప్పడాల పిండి తయారీ విధానము .
ఆలూరి కృష్ణ ప్రసాద్
రెండు గ్లాసుల పెసర పప్పు , పావు గ్లాసు శనగపప్పు రెండూ కలిపి మెత్తగా మిల్లులో మర పట్టించాలి .
మిక్సీ లో వేసుకుంటే పిండి బరకగా ఉంటుంది .
మెత్తగా రాదు .
ఒక పళ్ళెం లో గాని లేదా ఒక బేసిన్ లో ఈ పిండిని వేసుకోవాలి .
పావు స్పూను లో సగం పొడి చేసిన ఇంగువ , తగినంత ఉప్పు కొద్ది నీళ్ళల్లో వేసి స్పూను తో బాగా కలిపి సిద్ధం చేసుకోవాలి .
అప్పడాల పిండికి వాడే సీమ మిరపకాయలు దొరుకుతాయి .
ఆ మిరపకాయలు మరియు కాస్త పెసర పిండి మిక్సీ లో వేసుకుని 
బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .

ఈ గ్రైండ్ చేసిన పొడిని బేసిన్ ఉన్న మిశ్రమంతో కలిపి, గ్లాసులో కలిపి ఉంచుకున్న ఇంగువ నీళ్ళు కూడా పోసి ,అవసరమయితే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి .
తర్వాత రోలు మరియు పచ్చడి బండ శుభ్రంగా తుడుచుకొని , 
వేరు శనగ నూనె దంపే రోలు లోపలి భాగం లో రాసి , ఈ ముద్దను అందులో వేసి బాగా ముద్ద అంతా కలిసి అప్పడాలు వత్తడానికి మృదువుగా ఉండే విధంగా దంచుకోవాలి .

మర్దనా చేయడం పూర్తి అయిన తర్వాత చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .
మొత్తము పిండి ఒక్కసారి కలుపుకోనవసరం లేదు.
నీళ్ళు కలపకముందే పిండిని ఒక సీసాలో భద్రపరుచుకొని అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా పిండి కలుపు కొనవచ్చును .
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ అప్పడాల పిండి నంచుకుని తింటుంటే , ఆ రుచి అద్భుతంగా ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి