Monday, May 29, 2017

పచ్చిమిర్చి నువ్వుల పచ్చడి .

పచ్చిమిర్చి నువ్వుల పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్

తయారీ విధానము .
ముందుగా చిన్న నిమ్మకాయంత చింతపండు రెబ్బలు గా విడదీసి
కొద్దిగా నీటిలో పది నిముషముల పాటు తడిపి ఉంచుకోవాలి .

పదిహేను పచ్చిమిరపకాయలు నూనెలో విడిగా మగ్గబెట్టి వేరేగా ఉంచుకోవాలి .
పావు కప్పు తెల్ల నువ్వు పప్పు నూనె వేయకుండా బాండీలో దోరగా వేయించుకుని విడిగా మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని విడిగా ఉంచు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే , రెండు స్పూన్లు మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ వేసి పోపు వేయించు కోవాలి .
పోపు చల్లారగానే మిక్సీలో చింతపండు , మగ్గిన పచ్చిమిర్చి , కాస్త పసుపు , తగినంత ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేయించిన పోపు , నువ్వుల పొడి కూడా వేసి మిక్సీ వేసుకోవాలి .
అంతే నువ్వుల ఘమ ఘమ లతో పచ్చిమిర్చి నువ్వుల పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి