Wednesday, May 31, 2017

అటుకుల తో దద్ధ్యోజనం .

అటుకుల తో దద్ధ్యోజనం .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తయారీ విధానము .
ఒక నూట యాభై గ్రాముల అటుకులు ఒక గిన్నెలోకి తీసుకోండి .
అందులో ఒక అర లీటరు పెరుగు కలపండి .
అందులో రెండు పచ్చి మిర్చి , చిన్న అల్లంముక్క, కొత్తిమీర దంచి కలుపుకోండి .
తగినంత ఉప్పు , అందులో వేసి కలపండి .
స్టౌ మిద పోపు గరిట పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి రెండు ఎండుమిర్చి , స్పూను పచ్చిశనగపప్పు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , తగినంత ఇంగువ , రెండు రెబ్బల కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి
అంతే అటుకులతో దద్ధ్యోజనం సర్వింగ్ కు సిద్ధం.
మేము దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఒక లీటరు పాలు మంచి నీళ్ళ సీసాలో ముందుగానే తోడు పెట్టు కుంటాం .
ఒక పావు కిలో అటుకులలో తగినంత ఉప్పువేసి పైన నేను చెప్పిన విధంగా పోపు వేసి అందులో అల్లం , పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి బాగా కలిపి బాక్స్ లో వేసి తీసుకొని వెడతాం.
తిన బోయే పదిహేను నిముషముల ముందు సీసాలో తోడు పెట్టిన పెరుగు అందులో వేసుకుని బాగా స్పూను తో కలిపి తింటాం.
Panty Car రైల్లో ఉన్నా లేకపోయినా భోజనాలు చేయకుండా ఈ అటుకుల దద్ధ్యోజనం తినేస్తాము .
ఇందులో నంజుకోవడానికి నిమ్మకాయ ఊరగాయ కాని , మాగాయ పచ్చడి కాని బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి