Wednesday, May 31, 2017

చుక్క కూర పచ్చడి .

చుక్క కూర పచ్చడి .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి .
చుక్కకూర ---- నాలుగు కట్టలు
పచ్చి మిరపకాయలు --- ఎనిమిది
కొత్తిమీర --- ఒక కట్ట
ఉప్పు --- తగినంత 
పసుపు -- చిటికెడు

చుక్క కూర శుభ్రం చేసుకుని సన్నగా తరుగు కోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి 
నూనె బాగా కాగాక చుక్క కూర , పచ్చిమిర్చి , తగినంత ఉప్పు , చిటికెడు పసుపు వేసి మూత పెట్టి చుక్క కూర బాగా మగ్గ నిచ్చి దింపి వేరే తీసుకోవాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె కాగగానే నాలుగు ఎండుమిరపకాయలు , స్పూనున్నర మినపప్పు , పావు స్పూను జీలకర్ర ,
అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ కాస్త కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .

తర్వాత మిక్సీలో ముందు ఎండుమిరపకాయలు వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత మగ్గిన చుక్క కూర పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
చివరగా మిగిలిన పోపు వేసి తరిగిన కొత్తిమీర వేసి ఒక సారి మళ్ళీ మిక్సీ వేసుకుని వేరే Bowl లోకి తీసుకోవాలి .
ఈ పచ్చడి లో చుక్కకూర లో పులుపు ఉంటుంది కనుక చింతపండు వేయనవసరంలేదు.
అన్నం లోకి మరియు దోశెలలోకి ఈ చట్నీ బాగుంటుంది

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి