Tuesday, May 30, 2017

చుక్క కూర పప్పు

చుక్క కూర పప్పు
ఆలూరి కృష్ణ ప్రసాద్

ప్రియ మిత్రులారా !
ఆరోగ్యానికి చుక్క కూర చాలా మంచిది .
చుక్క కూర అందరూ పప్పు చేస్తారు.
పెసరపప్పు లో కంటే కందిపప్పు లో వేసుకుంటేనే చుక్క కూర పప్పు చాలా రుచిగా ఉంటుంది .
తయారు చేసే విధానం కూడా చాలా సులభం.
ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు లో తగినంత నీరు పోసి స్టౌ మీద పెట్టి మూత పెట్టకుండా ఉడకనివ్వాలి .
మూత పెడితే పప్పు పైకి పొంగుతుంది.
పప్పును మూడొంతుల పైగా ఉడకనివ్వాలి .
ఆ తర్వాత అందులో తరిగిన చుక్కకూర , తరిగిన పచ్చి మిరపకాయ ముక్కలు , కరివేపాకు , కొంచెం పసుపు వేసి
సన్నని సెగన మరో పది నిముషముల పాటు ఉడకనివ్వాలి .

ఇప్పుడు తగినంత ఉప్పు వేయాలి .
మరో మూడు నిముషములపాటు ఉంచి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోండి .
తదుపరి కాసిని మెంతులు , ఎండు మిరపకాయలు , ఆవాలు , ఇంగువ వేసి నూనె పోపు పెట్టుకోండి.
అంతే ఊరించే చుక్క కూర పప్పు సిద్ధం.
చుక్క కూరలో సహజంగానే పులుపు ఉంటుంది కాబట్టి ఇంక చింతపండు వేసుకోనక్కరలేదు.
అంతే నోరూరించే పులపుల్లని చుక్కకూర పప్పు అన్నం లోకి మరియు చపాతీల లోకి సిద్ధం .
ఫోటో You tube.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి