Wednesday, May 31, 2017

సింపుల్ గా బీన్స్ కొబ్బరి కూర

సింపుల్ గా బీన్స్ కొబ్బరి కూర
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 


తయారీ విధానము .
ఓ పావు కిలో బీన్స్ శుభ్రంగా కడిగి , అటు చివర ఇటు చివర తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
కుక్కర్ లో తగినన్ని నీళ్ళు పోసి తరిగిన బీన్స్ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి స్టౌ మీద పెట్టి రెండు విజిల్స్ వచ్చాక దింపి , తర్వాత ప్లేటులో వార్చుకుని , దానిపై కొద్దిగా పసుపు వేసుకోండి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే మూడు ఎండుమిర్చి తుంపిన ముక్కలు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ, రెండు రెమ్మలు కరివేపాకు పోపు వేసుకోండి .
పోపు వేగగానే ఉడికించిన బీన్స్ ముక్కలు వేసి మూత పెట్టి ఆ రేడు నిముషాలు మగ్గ నివ్వండి .
తర్వాత సరిపడా ఉప్పు , స్పూను కారం , ఒక చిప్ప 
పచ్చి కొబ్బరి తురుము వేసి మరో మూడు నిముషాలు అయ్యాక దింపి వేరే గిన్నె లోకి తీసుకోండి.

అంతే . బీన్స్ కొబ్బరి కూర భోజనము లోనికి మరియు రోటీల లోకి సర్వింగ్ కు సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి