ఆలూరుకృష్ణప్రసాదు .
ఉల్లిపాయ పులుసు.
ఉల్లిపాయలు -- పావు కిలో లేదా 4
చింతపండు -- 30 గ్రాములు. లేదా నిమ్మకాయంత.
బెల్లం -- 30 గ్రాములు .
పచ్చిమిర్చి -- 4
కరివేపాకు -- మూడు రెమ్మలు
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
కొత్తిమీర -- కొద్దిగా
బియ్యపు పిండి -- స్పూను
పోపుకు .
ఎండుమిరపకాయలు - 4
ముక్కలుగా చేసుకోవాలి .
నూనె -- మూడు స్పూన్లు
మెంతులు -- పావు స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారి విధానము .
ముందుగా స్టౌ మీద గ్లాసున్నర నీళ్ళు పోసి నీళ్ళు మరిగాక చింతపండు వేసి దింపి చల్లారాక చిక్కగా రసం తీసుకోవాలి .
ఉల్లిపాయలు కాస్త పెద్ద ముక్కలుగా తరుగు కోవాలి .
పచ్చిమిర్చి నిలువుగా తరుగుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , కరివేపాకు వేసి పోపు వేగాక తరిగిన ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మూతపెట్టి ముక్కలను బాగా మగ్గనివ్వాలి .
ముక్కలు మగ్గగానే రెడీగా ఉంచుకున్న చింతపండు రసం, పసుపు , ఉప్పు , బెల్లం కూడా వేసి పదిహేను నిముషాల సేపు బాగా తెర్లనివ్వాలి .
తర్వాత అర గ్లాసు నీళ్ళలో స్పూను బియ్యపు పిండి వేసి స్పూనుతో బాగా కలిపి మరుగుతున్న పులుసు లో పోసి మరో అయిదు నిముషాలు ఉంచి దింపుకుని పైన కొత్తిమీర వేసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే ఉల్లిపాయ పులుసు సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment