Thursday, August 31, 2017

బెండకాయ నువ్వుల పొడి కూర

ఈ రోజు  స్పెషల్ .

బెండకాయ  నువ్వుల  పొడి  కూర.

కావలసినవి .

లేత బెండకాయలు  ---  పావు  కిలో.
నువ్వు  పప్పు  --  100గ్రాములు .
నూనె  --  100  గ్రాములు.
ఎండుమిరపకాయలు  -- 6
జీలకర్ర   --  అర స్పూను .
ఉప్పు  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   నువ్వుల  పొడి  సిద్ధం  చేసుకోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  నూనె  వేయకుండా  నువ్వు పప్పు , ఎండుమిర్చి , జీలకర్ర   కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకుని  చల్లారగానే  సరిపడా  ఉప్పు వేసుకుని   మిక్సీ లో  మెత్తగా  పొడి  చేసుకుని  వేరుగా  ఉంచుకోవాలి .

లేత  బెండకాయలు  రెండువైపులా   ముచికలు  తీసుకొని   చాకుతో  నిలువుగా   మధ్యలో  గాటు  పెట్టుకోవాలి .

కాయలు  మరీ పెద్దవి  అయితే  మధ్యకు  తరుగుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  నూనె  మొత్తం   పోసి , నూనె  బాగా కాగగానే  , కాయలు పళంగా  తరిగిన   బెండకాయలు  వేసి  గరిటతో  కలుపుతూ   బాగా  వేగనివ్వాలి .

తరువాత  వేగిన  కాయలు వేరే  పళ్ళెంలో   తీసుకొని , ముందుగా  సిద్ధం  చేసుకున్న  నువ్వులపొడి  కాయల్లో  కూరుకుని , బాగా  కాగుతున్న  వేడి వేడి  నూనె  ప్రతి కూరిన కాయపై  పోసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  బెండకాయ  నువ్వులపొడి  కూర  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి