కొబ్బరి బర్ఫీ.
కావలసినవి.
కొబ్బరి తురుము --- రెండు కప్పులు
పంచదార --- ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి -- అర స్పూను .
జీడిపప్పు -- ఎనిమిది
నెయ్యి --- మూడు స్పూన్లు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండి పెట్టి మొత్తం నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే ముందుగా జీడిపప్పు వేసి బంగారు రంగులో వేయించి వేరే ప్లేటులో ఉంచుకోవాలి .
తర్వాత అదే నెయ్యి బాండీలో పచ్చి కొబ్బరి తురుము మరియు పంచదార వేసి స్టౌ మీడియం సెగలో పెట్టి అట్లకాడతో మిశ్రమాన్ని బాగా కలుపుతూ బాగా పాకం వచ్చి దగ్గర పడి , రెండు చేతి వేళ్ళతో పట్టుకుని చూస్తే పాకం చేతికి అంటుకునే వరకు ఉంచాలి .
తర్వాత అందులో యాలకుల పొడి మరియు జీడిపప్పు ను కూడా వేసుకుని బాగా కలిపాలి .
ఒక పళ్ళానికి నెయ్యి రాసి ఈ పాకం అందులో వేసి అట్లకాడతో నాలుగు మూలలా చదును చేసి వేడి మీదనే చాకుతో ముక్కలుగా కోసుకోవాలి.
అంతే రుచికరమైన కొబ్బరి బర్ఫీ సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment