Thursday, August 31, 2017

స్వీట్ కార్న్ జీరా రైస్

స్వీట్  కార్న్  మరియు  జీరా  రైస్.

కావలసినవి .

స్వీట్ కార్న్  --  గింజలను  వలుచుకుని  ఒక కప్పు  సిద్ధం  చేసుకోవాలి .
బియ్యము  --  ఒక  గ్లాసు .
జీలకర్ర   --   30  గ్రాములు కొద్దిగా  కచ్చాపచ్చాగా  దంచుకోవాలి .
లవంగాలు  --  10 
జీడిపప్పు  --  15 
మిరియాల  పొడి  --  పావు స్పూను
నెయ్యి  --  50  గ్రాములు
ఉప్పు  --   తగినంత .
కొత్తిమీర  --  ఒక కట్ట  సన్నగా  తరుగు కోవాలి .

తయారీ విధానము .

ఒక గ్లాసు  బియ్యము  గిన్నెలో పోసుకుని  కడిగి  రెండు గ్లాసుల  నీళ్ళు పోసుకుని     పదిహేను  నిముషాల పాటు  నానబెట్టు కోవాలి .

ఆ తర్వాత   స్టౌ  మీద పెట్టి పొడిగా  వండుకోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము  నెయ్యి  వేసి  నెయ్యి  బాగా  కాగగానే   ముందుగా  జీడిపప్పు  వేయించుకుని  వేరే ప్లేటులో  పెట్టుకోవాలి .

ఆ తర్వాత  అదే  బాండీలో కచ్చాపచ్చాగా దంచిన  జీలకర్ర , లవంగాలు వేసి వేయించుకుని  తర్వాత  స్వీట్ కార్న్ , మిరియాల  పొడి  సరిపడా  ఉప్పు వేసి  స్వీట్ కార్న్  మగ్గగానే  ఉడికిన  అన్నం కూడా  గరిటతో  వేసుకుని   నాలుగు  మూలలా  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

సన్నగా  తరిగిన  కొత్తిమీర  కలుపుకోవాలి .

చివరలో  జీడిపప్పు   కూడా  కలుపుకోవాలి .

అంతే  నేతి  వాసనతో  ఘమ  ఘమ  లాడే  స్వీట్  కార్న్  జీరా  రైస్  సర్వింగ్ కు  సిద్ధం.

ఇందులో రెండు కప్పుల  పెరుగులో  సన్నగా  తరిగిన  పచ్చి  ఉల్లిపాయలు , మూడు  పచ్చి మిరపకాయలు , కొత్తిమీర , కరివేపాకు , తగినంత  ఉప్పు  వేసి  చేసిన  పెరుగు  చట్నీ  బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి