Thursday, August 31, 2017

అల్లం పచ్చడి

అల్లం పచ్చడి .

ఆలూరుకృష్ణప్రసాదు .

కావలసినవి .

అల్లం  ---  50  గ్రాములు .
చింతపండు  --  100 గ్రాములు
పసుపు  --  కొద్దిగా
ఎండుమిరపకాయలు  --  15
పచ్చిమిరపకాయలు  --  8
ఉప్పు --  తగినంత

పోపుకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిర్చి  --  3 
మినపప్పు  --  స్పూనున్నర
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ విధానము .

అల్లం  పై చెక్కు తీసుకుని  ముక్కలుగా  తరుగుకొని  ఉంచుకోవాలి

చింతపండు   విడదీసి గింజలను  తీసి  కొద్దిగా వేడి నీళ్ళు పోసి   తడిపి  ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ  పెట్టి  రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు , ఆవాలు , ఇంగువ  వేసి  పోపు వేయించి  అందులో  పచ్చి మిరపకాయలు  కూడా  వేసి మగ్గ పెట్టుకోవాలి .

పోపు  చల్లారగానే  మిక్సీ లో  ముందుగా  ఎండుమిరపకాయలు ,తగినంత  ఉప్పు మరియు కొద్దిగా  పసుపు  వేసి  మెత్తగా  వేసుకోవాలి .

తర్వాత  తడిపి ఉంచుకున్న  చింతపండు , బెల్లం  ముక్క , అల్లం  ముక్కలు , పచ్చిమిరపకాయల  పోపు  వేసి  మెత్తగా  మిక్సీ   వేసుకోవాలి .

మళ్ళీ  స్టౌ మీద బాండీ  పెట్టి  మిగిలిన నూనె  వేసి  నూనె బాగా  కాగగానే   ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు  ఇంగువ  వేసి  పోపు పెట్టుకోవాలి .

ఇప్పుడు   వేయించిన  పోపు కూడా  వేసి  మిక్సీ  లో వేసి  ఒకసారి  మిక్సీ  వేసుకోవాలి .

అంతే  ఇడ్లీ , దోశెలు , గారెలు , చపాతీలు మరియు భోజనము లోనికి ఎంతో  రుచిగా  ఉండే  అల్లం  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి