Thursday, August 31, 2017

పల్లీలు నువ్వుల పొడి

పల్లీలు  నువ్వుల పొడి .

కావలసినవి .

పల్లీలు  --  200 గ్రాములు .
నువ్వులు --  100  గ్రాములు
ఎండుమిరపకాయలు  --  10
జీలకర్ర  --  స్పూను
ఉప్పు  --  తగినంత

తయారీ విధానము .

ముందుగా  పల్లీలు   స్టౌ  మీద  బాండి  పెట్టి  పల్లీలు  నూనె  వేయకుండా  కమ్మని వాసన  వచ్చేదాకా వేయించుకోవాలి .

చల్లారగానే  పై పొట్టు  తీసి  వేరుగా  ఉంచుకోవాలి .

మళ్ళీ   స్టౌ మీద బాండి  పెట్టి  నువ్వు పప్పు , ఎండుమిరపకాయలు మరియు  జీలకర్ర  నూనె  వేయకుండా    వేగిన  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి .

చల్లారగానే  వేయించిన  పల్లీలు , నువ్వుపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర  మరియు  సరిపడే  ఉప్పువేసి   మిక్సీ లో  మెత్తగా  వేసుకోవాలి .

అంతే  ఇడ్లీ , దోశెలు  మరియు  భోజనము  లోకి  రుచికరమైన  పల్లీలు  నువ్వుపప్పు   పొడి  సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి