ఈ రోజు రొటీన్ టైపులో వంకాయ కూర చెయ్యకుండా కొంచెం వెరైటీగా చేసాను .
కూర మాత్రం సూపర్ గా వచ్చింది .
నేను పావు కిలో వంకాయల కూరకు కొలతలు ఇస్తున్నాను .
మీరు అర కిలో కాయలు చేసుకునేటట్లయితే దినుసులు రెట్టింపు వేసుకోండి .
వంకాయ కొబ్బరి కూర .
కావలసినవి .
సన్నని నీలం రంగు పొడుగు వంకాయలు -- పావు కిలో .
వంకాయలు శుభ్రంగా కడుగుకొని ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్ళు పోసి అర స్పూను ఉప్పు వేసి , అందులో వంకాయలు నిలువుగా ముక్కలు తరుగుకోవాలి .
పచ్చి కొబ్బరి -- అర చిప్ప .
చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
పచ్చిమిరపకాయలు -- 8
అల్లం --- 15 గ్రాములు .
పై చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
పసుపు -- కొద్దిగా
ఉప్పు --- తగినంత
పోపుకు --
నూనె --- అయిదు స్పూన్లు
ఎండుమిరపకాయలు --- 4
శనగపప్పు --- స్పూనున్నర
మినపప్పు -- స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
కరివేపాకు --- మూడు రెమ్మలు.
తయారీ విధానము .
ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు , పచ్చిమిర్చి , అల్లం ముక్కలు మరియు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ లో కచ్చాపచ్చాగా వేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి అయిదు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , శనగపప్పు , మినపప్పు , జీలకర్ర . ఆవాలు మరియు కరివేపాకు వేసి పోపు వేయించుకొని పోపు వేగగానే అందులో నీళ్ళలో తరిగిన వంకాయ ముక్కలు , కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి మెత్తగా మగ్గ నివ్వాలి .
తరువాత పచ్చి కొబ్బరి మిశ్రమము కూడా వేసి , ఒక అయిదు నిముషాలు పచ్చి వాసన పోయేవరకు ఉంచి దింపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే వంకాయ కొబ్బరి కూర భోజనము లోకి సిద్ధం.
0 comments:
Post a Comment