పెసర పప్పు పచ్చడి .
కావలసినవి .
చాయపెసరపప్పు -- 100 గ్రాములు.
ఎండు మిరపకాయలు -- 8
జీలకర్ర -- ఒక స్పూను
ఇంగువ --- కొద్దిగా
నెయ్యి -- రెండు స్పూన్లు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి , నెయ్యి బాగా కాగగానే పెసర పప్పు , ఎండు మిరపకాయలు , జీలకర్ర మరియు ఇంగువ వేసి బంగారు రంగులో వేయించుకోవాలి .
తర్వాత మిక్సీ లో ముందుగా ఎండు మిరపకాయలు , జీలకర్ర , ఇంగువ మిశ్రమము మరియు సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా వేసుకోవాలి.
తర్వాత వేయించిన పెసరపప్పు వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
పులుపు ఇష్ట మైనవారు రెండు రెబ్బలు చింతపండు వేసుకుని రుబ్బు కోవచ్చును.
ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇంగువ బదులు వేసుకోవచ్చును .
పైన మినపప్పు , ఆవాలు , రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకుని నేతితో పోపు పెట్టుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment