క్యారట్ హల్వా .
కావలసినవి .
తురిమిన క్యారెట్ -- రెండు కప్పులు.
పంచదార -- ఒక కప్పు
యాలకుల పొడి -- అర స్పూను .
జీడిపప్పు -- పది పలుకులు .
కిస్మిస్ -- పది
బాదంపప్పు -- 5
నెయ్యి -- 50 గ్రాములు.
తయారీ విధానము .
ముందుగా షుమారు ఒక ఆరు నుండి ఎనిమిది క్యారెట్లను శుభ్రంగా కడుగుకొని ( పై చెక్కు తీయడం మీ ఇష్టం ) ఎండు కొబ్బరి కోరాముతో కోరుకుని రెండు కప్పులు క్యారెట్ తురుమును సిద్ధం చేసుకోవాలి .
పై చెక్కు తీయకపోతేనే బలవర్ధకం .
యాలకులు పొడి కొట్టి అర స్పూను సిద్ధం చేసుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు , బాదం పప్పు , కిస్మిస్ వేయించుకుని వేరే ప్లేటు లోకి తీసుకుని విడిగా తీసి ఉంచుకోవాలి .
అదే బాండీలో మరో రెండు స్పూన్లు నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకుని విడిగా వేరే ప్లేటులో ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద మరలా బాండీ పెట్టి కప్పు పంచదార వేసి , పంచదార మునిగే వరకు నీళ్ళు పోసి తీగ పాకం రానివ్వాలి .
అంటే రెండు వేళ్ళతో ముట్టుకుంటే పాకం తీగలా సాగాలి .
ఆ తర్వాత అందులో అర స్పూను యాలకుల పొడి వేసి బాగా కలిపి , వేయించుకుని వేరే ఉంచిన క్యారెట్ తురుము , జీడిపప్పు , బాదం , కిస్మిస్ మరియు రెండు స్పూన్లు నెయ్యి వేసి అట్లకాడతో బాగా కలుపుతూ మరో అయిదు నిముషాలు ఉంచి దింపుకోవాలి .
అంతే వేడి వేడి క్యారెట్ హల్వా సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment