Thursday, August 31, 2017

క్యారెట్ , కొబ్బరి మరియు మామిడి కాయ పచ్చడి .

ఆలూరుకృష్ణప్రసాదు .

క్యారెట్ , కొబ్బరి  మరియు  మామిడి  కాయ  పచ్చడి .

కావలసినవి .

క్యారట్  --   రెండు .  చిన్న చిన్న  ముక్కలుగా  చాకుతో  కట్ చేసుకోవాలి .

చెక్కు  తీయనవసరము  లేదు.

పచ్చి  కొబ్బరి   --  ఒక  చిప్ప .
చిన్న  చిన్న  ముక్కలుగా  కట్  చేసుకోవాలి .

పచ్చి  మామిడి  కాయ  -- సగం .

పై చెక్కు  తీసుకుని  చిన్న  చిన్న  ముక్కలుగా  కట్  చేసుకోవాలి .

పచ్చిమిరపకాయలు  --  6
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర  --  చిన్న కట్ట

పోపునకు .

ఎండుమిరపకాయలు  --  8
పచ్చి శనగపప్పు  --  రెండు స్పూన్లు .
మినపప్పు  --  స్పూను
మెంతులు  --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
జీలకర్ర  --  పావు స్పూను
ఇంగువ  --  కొద్దిగా
నూనె  --  మూడు స్పూన్లు .

తయారీ  విధానము  .

ముందుగా   స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు ,  శనగపప్పు  , మినపప్పు , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ మరియు  కరివేపాకు  వేసి  పోపు పెట్టుకోవాలి .

పోపు చల్లారగానే  ముందుగా   మిక్సీ  లో ముందుగా  ఎండుమిరపకాయలు ,
సరిపడా ఉప్పు  మరియు  కొద్దిగా  పసుపు   వేసి   మెత్తగా  వేసుకోవాలి .

తర్వాత  క్యారెట్  ముక్కలు , పచ్చి  కొబ్బరి   ముక్కలు మరియు  మామిడి  కాయ ముక్కలు , పచ్చిమిరపకాయలు  వేసి  ముక్కలను   మిక్సీ లో మెత్తగా  వేసుకోవాలి .

ఆ తర్వాత  మిగిలిన  పోపు అంతా వేసి  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  కొత్తిమీర  కూడా  వేసుకుని  మిక్సీ వేసుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే  దోశెలు, చపాతీలు  మరియు  అన్నం  లోకి  ఎంతో  రుచిగా  ఉండే  క్యారెట్ , కొబ్బరి మరియు  మామిడి  కాయ  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి