ఆలూరుకృష్ణప్రసాదు .
చేగోడీలు.
కావలసినవి .
బియ్యపు పిండి --- మూడు కప్పులు.
పచ్చిశనగపప్పు --- ఒక కప్పు
కారం --- ఒక స్పూను.
ఉప్పు -- తగినంత
వెన్న -- నిమ్మకాయంత
నీళ్ళు -- మూడుకప్పులు
నూనె -- పావు కిలో
తయారీ విధానము .
ముందుగా పచ్చిశనగపప్పు తగినన్ని నీళ్ళు పోసి రెండు గంటలు నాన బెట్టుకుని తర్వాత నీళ్ళు వడకట్టుకుని ఒక పళ్ళెంలో వేసుకోవాలి .
తర్వాత స్టౌ వెలిగించి గిన్నెలో ఒక మూడు కప్పులు నీళ్ళు పోసి నీళ్ళు బాగా తెర్లుతున్నప్పుడు అందులో వెన్న, కారం , తగినంత ఉప్పు మరియు బియ్యపు పిండి వేసి గరిటతో బాగా కలపాలి .
పిండి చల్లారగానే చేతులకు నూనె రాసుకుని పీట పై ముద్దను వేసి బాగా మెదిపి ముద్దను పొడవుగా చేసి వాటికి శనగపప్పు అద్ది చిన్న చిన్న రౌండ్లుగా తయారు చేసుకోవాలి.
అన్నీ చేగోడీలు తయారు చేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి మొత్తము నూనె పోసి నూనె బాగా కాగగానే ఎడెనిమిది చేగోడీల చొప్పున నూనె లో వేసి బంగారు రంగులో వేయించు కోవాలి .
అంతే ఈ వానాకాలంలో వేడి వేడి చేగోడీలు మధ్యాహ్నము వేళ అల్పాహారమునకు సిద్ధం.
0 comments:
Post a Comment