ఆలూరుకృష్ణప్రసాదు
కాల్చిన అరటి కాయలతో కూర.
కావలసినవి .
అరటి కాయలు -- రెండు.
ఉల్లిపాయలు --- రెండు
పచ్చిమిర్చి -- అయిదు .
అల్లం తరుగు -- స్పూను
కరివేపాకు -- రెండు రెబ్బలు.
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
నిమ్మకాయ -- ఒకటి
కారం --- స్పూను.
పోపుకు .
నూనె -- మూడు స్పూన్లు
ఎండుమిరపకాయలు - 4
చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
పచ్చి శనగపప్పు -- స్పూనున్నర
మినపప్పు -- స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా .
తయారీ విధానము .
ముందుగా అరటి కాయలు చెక్కు తీయకుండా పైన నూనె రాసి స్టౌ మీద మీడియం సెగన పెట్టి అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి .
చల్లారగనే నీళ్ళ చేతితో పై చెక్కు వలుచుకుని , చేతితో ముక్కలుగా నలుపుకోవాలి .
ఆ ముక్కలు వేరే ప్లేటులో తీసుకుని పైన పసుపు వేసుకుని విడిగా ఉంచుకోవాలి .
ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.
పచ్చి మిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
అల్లం ముక్క పై చెక్కు తీసుకుని సన్నని ముక్కలుగా తరుగుకోవాలి లేదా సన్నగా తురుముకొని ఒక స్పూను అల్లం తరుగు సిద్ధం చేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , కరివేపాకు , అల్లం తరుగు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి పోపు బాగా వేగగానే తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా వేసి మూతపెట్టి ఉల్లిపాయలను బాగా మగ్గనివ్వాలి .
తర్వాత విడిగా ఉంచుకున్న అరటి కాయల ముక్కలు , తగినంత ఉప్పు, స్పూను కారం వేసి కూడా వేసి కూర బాగా మగ్గగానే దింపి ఒక కాయ నిమ్మరసం కూరలో పిండి గరిటతో బాగా కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే కాల్చిన అరటి కాయలతో కూర భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment