Thursday, August 31, 2017

అరటికాయ వేపుడు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఈ రోజు  అరటి  కాయ  వేపుడు .

తయారీ విధానము  .

రెండు అరటి కాయలు  నీళ్ళలో  వేసి  చెక్కు తీసుకుని  ముక్కలుగా  తరుగు కోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె  వేసి  నూనె బాగా కాగగానే   స్పూను  మినపప్పు , అర స్పూను  ఆవాలు  మరియు  రెండు  రెమ్మలు  కరివేపాకు  వేసి  పోపు వేగగానే  అరటి కాయల  ముక్కలు కూడా  వేసి మూత పెట్టకుండా  ఎర్రగా  వేయించుకోవాలి .

చివరలో  ఉప్పూ  మరియు కారం  వేసుకుని   వేడి వేడిగా   తినాలి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి