ఆలూరుకృష్ణప్రసాదు .
దొండకాయ ముక్కల ఊరగాయ .
కావలసినవి .
దొండకాయలు -- 15 కాయలు పచ్చిగా ఉండాలి . పండకూడదు.
నిమ్మకాయలు -- 4 కాయలు మధ్యకు కోసి ఒక గిన్నెలో రసం తీసుకోవాలి .
కారం -- మూడు స్పూన్లు .
మెంతిపొడి --- స్పూను
ఉప్పు --- తగినంత .
పసుపు --- కొద్దిగా
పోపునకు .
నూనె --- మూడు స్పూన్లు
ఎండుమిరపకాయలు --3 చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఆవాలు --- స్పూను
ఇంగువ --- కొద్దిగా
తయారీ విధానము .
ఒక గిన్నెలో తరిగిన దొండకాయ ముక్కలు , నిమ్మరసం , కొంచెం పసుపు, కారం , మెంతిపొడి మరియు తగినంత ఉప్పు వేసి స్పూను తో బాగా కలుపుకోవాలి .
స్టౌ మీద బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఎండుమిర్చి ముక్కలు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు వేగగానే ముక్కల పచ్చడిలో వేసి బాగా కలుపు కుని రెండు గంటల సేపు మూత పెట్టి ఉంచాలి .
దొండకాయ ముక్కలు నిమ్మరసం లో బాగా ఊరతాయి .
తర్వాత సర్వ్ చేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే దొండకాయ ముక్కల ఊరగాయ దోశెలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment