ఆలూరుకృష్ణప్రసాదు .
నీరుల్లి ( పెద్ద ఉల్లిపాయల ) చట్నీ .
కావలసినవి .
పచ్చి శనగపప్పు -- స్పూనున్నర .
మినపప్పు -- స్పూను న్నర
ఎండుమిరపకాయలు -- 8
ఉల్లిపాయలు -- 3 తరిగి ముక్కలుగా చేసుకోవాలి .
చింతపండు -- చిన్న నిమ్మకాయంత కొద్దిపాటి నీళ్ళతో తడుపు కోవాలి .
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
ఉప్పు -- తగినంత .
నూనె --- మూడు స్పూన్లు
తయారీ విధానము .
స్టౌ వెలిగించి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు వేగగానే తరిగిన ఉల్లిపాయల ముక్కలు కూడా వేసి వేగ నివ్వాలి .
చల్లారగానే మిక్సీ లో ముందు ఎండుమిరపకాయలు , తడిపిన చింతపండు , తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా వేసుకోవాలి .
తర్వాత ఉల్లిపాయల ముక్కలు మరియు మిగిలిన పోపు కూడా వేసుకుని మిక్సీ లో మెత్తగా వేసుకోవాలి .
అంతే దోశెలు , రోటీలు , చపాతీలు మరియు అన్నం లోకి ఉల్లిపాయ చట్నీ సిద్ధం.
0 comments:
Post a Comment