కొబ్బరి పచ్చడి .
కావలసినవి .
కొబ్బరి కాయ - 1 కాయను పగుల గొట్టి రెండు చిప్పలు పచ్చి కొబ్బరి కోరాముతో తురుము కోవలెను .
ఎండుమిరపకాయలు -- 8
పచ్చిమిరపకాయలు -- 5
చింతపండు -- ఉసిరి కాయంత . విడదీసుకుని నీటితో తడిపి ఉంచుకోవలెను.
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
బెల్లం -- చిన్న ముక్క ఇష్టం లేని వారు మానేయ వచ్చును .
పోపునకు --
నూనె -- మూడు స్పూన్లు
మినపప్పు -- స్పూను
మెంతులు -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా .
తయారీ విధానము .
కొబ్బరి కోరాముతో కోరుకుని సిద్ధంగా ఉంచుకోవాలి .
దాని పైన కొద్దిగా పసుపు వేయండి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , ఆవాలు , ఇంగువ వేసి పోపు వేగగానే తొడిమలు తీసిన పచ్చిమిర్చి కూడా వేసి ఒక నిముషం ఉంచి దింపుకోవాలి .
ఇప్పుడు మిక్సీ లో ఎండుమిర్చి , పచ్చిమిర్చి , తడిపిన చింతపండు , చిన్న బెల్లం ముక్క మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
చివరగా పోపు కూడా పచ్చడిలో వేసుకుని పోపు మరీ నలగకుండా ఒకసారి మిక్సీ వేసుకుని తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి భోజనము లోకే కాకుండా దోశెలు , పూరీలు మరియు చపాతీలలోకి కూడా చాలా బాగుంటుంది .
0 comments:
Post a Comment