ఆలూరుకృష్ణప్రసాదు .
దొండకాయ కొత్తిమీర కారం .
కావలసినవి.
దొండకాయలు --- అర కిలో
పచ్చిమిరపకాయలు -- 15
కొత్తిమీర --- రెండు కట్టలు
ఉప్పు --- తగినంత
నూనె --- 100 గ్రాములు
తయారీ విధానము .
మీకు కూర కొంచెం వేగినట్లుగా కావాలనుకుంటే బాండీ లో చేసుకోండి .
మీకు మెత్తగా కావాలనుకుంటే గిన్నెలో చేసుకోవాలి.
ఈ కూర కాయల పళంగా అయినా చేసుకోవచ్చు .
కానీ వేసవి కాలంలో బుల్లి బుల్లి లేత దొండ కాయలు మార్కెట్ లో దొరకవు .
దొరికే పక్షంలో ఇదే మిశ్రమాన్ని దొండకాయలు నాలుగు పక్షాలుగా చేసుకుని అందులో కూరుకుని గిన్నెలో చేసుకోవచ్చు .
ముందుగా దొండకాయలను చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
కొత్తిమీర కడిగి శుభ్రం చేసుకోవాలి .
ఇప్పుడు మిక్సీ లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మరియు తగినంత ఉప్పువేసి
కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి గిన్నెలో మొత్తం నూనె పోసి , నూనె బాగా కాగగానే దొండకాయ ముక్కలు వేసి , పైన నీళ్ళ గిన్నె మూత పెట్టి ముక్కలు బాగా మగ్గ నివ్వాలి .
మధ్య మధ్యలో మూత తీసి అట్లకాడతో ముక్కలను కదుపుతూ ఉండాలి .
మూడు వంతులు ముక్కలు మగ్గ గానే మిక్సీ వేసుకున్న కొత్తిమీర కారం వేసుకుని మళ్ళీ మూత పెట్టి ముక్కలు , మిశ్రమం కలిసేలా పూర్తిగా మగ్గనిచ్చి దింపు కోవాలి .
తర్వాత వేరే Bowl లోకి తీసుకోవాలి .
అంతే కొత్తిమీర సువాసనతో ఘమ ఘమ లాడే దొండకాయ కొత్తిమీర కారం కూర సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment