Thursday, August 31, 2017

కందిపచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు

కందిపచ్చడి  .
************

తయారీ  విధానము .

పది  ఎండుమిరపకాయలు , గ్లాసు కందిపప్పు  , స్పూను  జీలకర్ర
నూనె  వేయకుండా  బాండీలో  కమ్మని  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో వేయించిన కంది పప్పు  , ఎండుమిరపకాయలు  , జీలకర్ర   మిశ్రమం ,  మరియు తగినంత   ఉప్పు  వేసి   కొద్దిగా నీళ్ళు  పోసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

మేము  ఇలాగే   చేసుకుంటాము .

కొంతమంది

1. ఒక  నాలుగైదు  వెల్లుల్లి   రెబ్బలు  పచ్చడిలో  వేసుకుని  మిక్సీ  వేసుకుంటారు .

2 .  కొద్దిగా   చింతపండు రసం  మిక్సీ  లో  పచ్చడిలో  వేసి  మిక్సీ  వేసుకుంటారు.

3 .  కొంతమంది    పచ్చి  కరివేపాకు ను కూడా  వేసి మిక్సీ  వేసుకుంటారు .

4 .  కొంతమంది   పప్పును  వేయించేటప్పుడు  కొద్దిగా   ఇంగువ  పొడి  వేసుకుంటారు .

5 .  కొంతమంది  స్టౌ  మీద  పోపు గరిటె పెట్టి  మూడు  స్పూన్లు   నెయ్యి  వేసి  రెండు  ఎండుమిర్చి  ముక్కలుగా  చేసి , మినపప్పు , ఆవాలు , ఇంగువ  మరియు  కరివేపాకు   వేసి   పచ్చడిలో   పోపు  పెట్టుకుంటారు .

6.  కొంతమంది   పచ్చి కొబ్బరి  కూడా  పచ్చడిలో  వేసుకుంటారు .

మీ  అభిరుచి  ప్రకారం  ఏ  విధంగానైనా  మార్చి  చేసుకోవచ్చును .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి