Saturday, April 14, 2018

వేడి వేడి ఉల్లిపాయ పునుగులు

ఆలూరుకృష్ణప్రసాదు .

మధ్యాహ్నపు అల్పాహారము.

వేడి వేడి ఉల్లిపాయ  పునుగులు.

ఇడ్లీ  పిండి  పునుగులు  వేసే  గంట ముందు  బయట పెట్టుకోవాలి.

మూడు స్పూన్లు  పచ్చిశనగపప్పు  ఒక గంట సేపు నీళ్ళలో  నానబెట్టు కోవాలి .

షుమారు రెండు కప్పుల ఇడ్లీ పిండికి , అర కప్పు  బియ్యపు పిండి, నానబెట్టిన పచ్చిశనగపప్పు , నాలుగు తరిగిన  పచ్చిమిర్చి ,  రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కలు ,  తగినంత ఉప్పు ,  స్పూను కారం  ,  నాలుగు  రెమ్మలు తరిగిన   కరివేపాకు , కొద్దిగా  తరిగిన  కొత్తిమీర , రెండు స్పూన్లు  మైదా పిండి , చిటికెడు  వంట సోడా  వేసి  కొద్దిగా   నీళ్ళు  పోసి   పకోడీల పిండి మాదిరిగా గట్టిగా కలుపు కోవాలి  .

ఒక గంట సేపు అలాగే ఉంచాలి .

ఒక గంట తర్వాత స్టౌ  మీద  బాండీ  పెట్టి  200  గ్రాముల  నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   చేతితో కాని , స్పూను తో కాని  పునుగుల్లా వేసుకుని , వేడి వేడిగా  అల్లం  చట్నీతో తింటే  కర కర లాడుతూ  బాగుంటాయి .

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం .

మెంతి వంకాయ కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

మెంతి  వంకాయ కూర.

కావలసిన  పదార్థములు.

చిన్నవి  గుండ్రని  వంకాయలు  ---
అర కిలో

పచ్చి శనగపప్పు  --  30  గ్రాములు

చాయ  మినపప్పు  -  20  గ్రాములు .

మెంతులు  ---  మూడు  టీ  స్పూన్లు .

జీలకర్ర  --  అర  స్పూను

ఆవాలు  --  పావు  స్పూను

ఇంగువ  --  కొద్దిగా

ఎండు మిరపకాయలు  --  15

ఉప్పు  ---  తగినంత

పసుపు  --  కొద్దిగా

నూనె  --   150  గ్రాములు .

తయారు  చేయు విధానము .

ముందుగా  స్టౌ  వెలిగించి  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె వేసి
ముందుగా  మెంతులు , ఎండు మిరపకాయలు , పచ్చి శనగపప్పు  , చాయ మినపప్పు , జీలకర్ర  , ఆవాలు ,  ఇంగువ  వేసి  మెంతులు  పచ్చి వాసన  పోయి  ,
పోపు  కమ్మని  వాసన  వచ్చేదాకా  వేయించు కోవాలి.

పోపు  చల్లారిన  తర్వాత  మిక్సీలో  ఈ  పోపు , కాస్త పసుపు , తగినంత  ఉప్పు వేసి  కొంచెము  పప్పులు  పంటికి  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

వంకాయలు  కాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  , శుభ్రంగా  కడిగి  నాలుగు  పక్షాలుగా  చేసుకోవాలి .

ముందుగా   సిద్ధం  చేసుకున్న  కూర  పొడి   కాయల్లో  కూరు కోవాలి .

చివరలో కూర   దించబోయే  ఐదు నిముషాలు  ముందు  పైన  జల్లు కోవడానికి  కాస్త  పొడి  విడిగా  ఉంచుకోవాలి .

మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  అంతా పోసి  నూనె  బాగా  కాగాక  పొడి   కూరిన  వంకాయలు  వేసి  మీడియం  సెగన  వంకాయలు  మగ్గి  పొడి  వేగే  దాకా  మధ్య మధ్యలో  అట్లకాడతో  తిరగవేస్తూ
కలుపుతూ  ఉండాలి .

దింప  బోయే   అయిదు  నిముషాల ముందు  మిగిలిన పొడి  వేసి  వేగాక   దించుకుని , వేరే  డిష్ లోకి  తీసుకోవాలి .

అంతే  ఘమ ఘమ లాడే  మెంతి  వంకాయ కూర  సర్వింగ్  కు  సిద్ధం.

సంబంధిత  రెసిపీ  మరియు  ఫోటో  నా స్వంతం .

నువ్వుల పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

నువ్వుల పొడి .

ఈ నువ్వుల పొడి తయారు చేయడానికి  తెల్ల నువ్వుపప్పు వాడాలి .

తెల్ల నువ్వుపప్పు తో  నువ్వుల పొడి చాలా రుచిగా ఉంటుంది .

ఈ నువ్వుల పొడి  అన్నంలో  తినడానికి  కాకుండా  బెండకాయ , ఆనపకాయ , వంటి  కూరల్లో , బంగాళాదుంప , చామ దుంప వంటి వేపుళ్ళ లోను  వేసుకుంటే ఎంతో  కమ్మగా ఉంటుంది .

నువ్వుపప్పు పొడి .

తయారీ విధానము .

కావలసినవి .

నువ్వుపప్పు  --  200  గ్రాములు.
ఎండుమిరపకాయలు  - 8
ఉప్పు  --  తగినంత .

తయారీ విధానము .

స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా మీడియం సెగన  నువ్వుపప్పు , ఎండుమిరపకాయలు  కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో తగినంత  ఉపు వేసుకుని మెత్తగా  వేసుకుని  ఒక సీసాలో భద్ర పరుచుకోవాలి.

కావలసినప్పుడు  అన్నం లోకి  కూరల్లోకి  తీసుకుని వాడుకోవచ్చును.

ఇలా కొట్టిన నువ్వుపప్పు పొడి  పదిహేను రోజులు  పైనే నిల్వ ఉంటుంది .

హామీ పత్రం.

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి