Saturday, January 6, 2018

భోజనం ప్రాధాన్యత

శతం విహాయ భోక్తవ్యం!
సహస్రం స్నానమాచరేత్!!
లక్షం తత్వాతు దాతవ్యం!
కోటిం త్వక్త్వ హరిం స్మరేత్!!

తాత్పర్యం:
వంద పనులున్నపటికి వదిలిపెట్టి భోజనం చేయవలెను. వేయి పనులున్నను మాని స్నానం చేయవలెను. లక్ష పనులున్ననూ వాటిని పరిత్య జించి దానము చేయవలెను. కోటి పనులున్నప్పటికి వాటిని త్యజించి భగవంతుని స్మరించవలెను.

టమోటో ఉల్లిపాయ చట్నీ

ఆలూరుకృష్ణప్రసాదు .

టమోటో  ఉల్లిపాయ  చట్నీ .

రెండు ఉల్లిపాయలు  మరియు  రెండు టమోటోలు ముక్కలుగా తరగండి.

బాండీలో రెండు స్పూన్లు  నూనె పోసి  ఉల్లిపాయలు   మగ్గ పెట్టండి .

విడిగా   ప్లేటులో  తీసుకోండి

విడిగా  టమోటో  ముక్కలు కాస్త పసుపు  వేసి  మగ్గ పెట్టండి.

వేరే ప్లేటులో  తీసుకోండి .

మిక్సీ లో  ముందు మగ్గిన ఉల్లిపాయ  ముక్కలు  వేసి  మరీ మెత్తగా  కాకుండా మిక్సీ వేసుకోండి .

తర్వాత అందులో టమోటో  ముక్కలు , రెండు రెబ్బలు తడిపిన చింతపండు ,  స్పూనున్నర  ఎండు కారం  మరియు తగినంత  ఉప్పు 
వేసి మరీ మెత్తగా  కాకుండా మిక్సీ  వేసుకోండి .

తర్వాత వేరే గిన్నెలోకి  నూరిన పచ్చడి తీసుకుని  పోపు గరిటలో  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  రెండు ఎండుమిర్చి  ముక్కలుగా చేసి , స్పూను  మినపప్పు , అర స్పూను ఆవాలు, కొద్దిగా  ఇంగువ మరియు రెండు రెమ్మలు  కరివేపాకు  వేసి నూరిన పచ్చడి పైన పోపు పెట్టుకోండి.

ఇడ్లీ , దోశెలు, చపాతీలు , గారెలు మరియు  భోజనము  లోకి ఎంతో రుచికరమైన  టమోటో  ఉల్లిపాయ  చట్నీ సిద్ధం.

వెజిటబుల్ రైస్

ఆలూరుకృష్ణప్రసాదు .

వెజిటబుల్  రైస్.

కావలసినవి .

బియ్యము  --  ఒక గ్లాసు .
క్యారెట్లు  --  2
క్యాప్సికమ్  -- 2
ఉల్లిపాయలు  --  2
బీన్స్  --  100  గ్రాములు. చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .
నెయ్యి  --  మూడు  స్పూన్లు .
జీడిపప్పు   -- 10 

పొడికి .

నెయ్యి  --  రెండు స్పూన్లు .
ఎండుమిర్చి  - 5 
మినపప్పు  --  స్పూను
శనగపప్పు  --  స్పూను
వేరు శనగ గుళ్ళు  -  రెండు స్పూన్లు 
నువ్వుపప్పు  --  రెండు స్పూన్లు
ఎండు కొబ్బరి  --  పావు చిప్ప చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .
ఉప్పు  --  తగినంత

స్టౌ  మీద  బాండీ పెట్టి  నెయ్యి వేసి ముందుగా  జీడిపప్పు  వేయించుకుని  విడిగా  తీసి ఉంచుకోవాలి .
తర్వాత   పై దినుసులన్నీ  వేసి వేయించుకుని , సరిపడా  ఉప్పు వేసి  మిక్సీ లో మరీ మెత్తగా  కాకుండా  పొడి  కొట్టుకుని  ఉంచుకోవాలి .

తయారీ విధానము .

ముందుగా  గ్లాసు  బియ్యము సరిపడా
నీళ్ళు పోసి కుక్కర్ లో పొడిగా  వండుకోవాలి .

వెజిటబుల్స్  అన్నీ చిన్న ముక్కలుగా  తరిగి  ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే , ముందుగా  ఉల్లిపాయలు , క్యారెట్ ముక్కలు , క్యాప్సికమ్ ముక్కలు , బీన్స్ ముక్కలు వేసి  కొద్దిగా  ఉప్పువేసి  మూతపెట్టి  ముక్కలను  పది నిముషాలు  మెత్తగా  మగ్గ నివ్వాలి.

తర్వాత  అందులో  ఉడికించి  సిద్ధంగా  ఉంచుకున్న  అన్నం  వేసుకుని  గరిటతో  బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు   సిద్ధంగా  ఉంచుకున్న  పొడి  నాలుగు స్పూన్లు  వేసుకుని   మరో మూడు స్పూన్లు  నెయ్యి వేసి  బాగా కలుపుకుని పైన  నేతిలో వేయించిన  జీడిపప్పు  వేసుకుని   వేరే  డిష్  లోకి తీసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  వెజిటబుల్  రైస్  సర్వింగ్  కు సిద్ధం.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి