Tuesday, December 5, 2017

అరటికాయ చిప్స్

అరటి కాయ  చిప్స్.

ఆంధ్రాలో అరటి కాయ చిప్స్ వాడకం తక్కువ  కాని  కేరళ  తమిళనాడులో  అరటి కాయ చిప్స్ వాడకం బాగా ఎక్కువ .

మేము  అరటి కాయను నీళ్ళలో  ఉంచి పై చెక్కు  తీసి చక్రాలుగా  తరిగి  మరిగే నూనెలో ఎర్రగా వేయించుకుని ఉప్పు కారం వేసుకుంటాము .

అన్నంలో కూరగా నంచుకుని తింటాము.

లేదా  సాంబారులో  అప్పడాల బదులు నంచుకుని తింటాము .

వెరైటీ బెండకాయ ఫ్రై

ఆలూరుకృష్ణప్రసాదు .

వెరైటీ బెండకాయ fry.

తయారీ విధానము .

పావు కిలో బెండ కాయలు  ముక్కలుగా తరుగు కోవాలి .

ఆరు పచ్చి మిర్చి , అర కప్పు కొబ్బరి ముక్కలు మరియు సరిపడా ఉప్పు  వేసి కొంచెం  కచ్చా పచ్చాగా  మిక్సీ వేసుకోవాలి.

నేతిలో పది జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి.

స్టౌ మీద బాండీ పెట్టి  ఆరు స్పూన్లు  నూనె వేసి తరిగి  ఉంచుకున్న  బెండకాయ ముక్కలు వేసి బంగారు రంగులో  fry చేసుకోవాలి .

తర్వాత కొబ్బరి పచ్చిమిర్చి  ముద్దను వేసి  అది కూడా వేపుడు కూరలో ఎర్రగా వేగనివ్వాలి .

పైన  వేయించిన నేతి జీడిపప్పు పలుకులను కలుపుకోవాలి.

అంతే వెరైటి బెండ కాయ fry సర్వింగ్  కు సిద్ధం.

వెరైటీ మిర్చి బజ్జీ

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో వెరైటి  మిర్చి బజ్జీ.

తయారీ విధానము .

ఓ పావు కిలో  బోలుగా ఉన్న పెద్ద సైజు మిర్చి  బజ్జీ తీసుకుని  మధ్యలో గాటు పెట్టు కోవాలి.

రెండు బంగాళా దుంపలు  ఉడక పెట్టుకుని పై తొక్క తీసుకుని , ముక్కలుగా  చేసుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు   నూనె వేసి  నూనె బాగా కాగగానే , స్పూను  శనగపప్పు , స్పూను  మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అరస్పూను ఆవాలు , కొద్దిగా  ఇంగువ,  కరివేపాకు మరియు రెండు పచ్చిమిర్చి  ముక్కలుగా  తరిగి వేసుకుని  పోపు పెట్టుకుని అందులో ఉడికించిన బంగాళా దుంపలు కొద్దిగా పసుపు, తగినంత  ఉప్పు  మరియు  తరిగిన  కొత్తిమీర  వేసి ముద్దకూర చేసుకోవాలి .

ఆ కూరను  మిరపకాయలలో బాగా నిండుగా  కూరుకోవాలి .

ఒక వంద గ్రాముల శనగ పిండిలో , ఒక స్పూనున్నర  బియ్యపు పిండి , కొద్దిగా  ఉప్పు  మరియు చిటికెడు  వంట సోడా వేసుకుని  తగినన్ని నీళ్ళు పోసుకుని బజ్జీలు వేసుకునే విధముగా  పిండిని  జారుగా కలుపు కోవాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి పావు కిలో నూనె పోసి నూనె బాగా కాగనివ్వాలి .

తరువాత  Stuff చేసిన మిరపకాయలు  శనగ పిండిలో ముంచి బజ్జీలు నూనెలో వేసి కర కర లాడే విధముగా  వేయించుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే  బంగాళా దుంప కూర Stuff  చేసిన  మిరపకాయల బజ్జీలు  అల్పాహారంగా సర్వింగ్  కు సిద్ధం.

అల్లం  పచ్చడితో తింటే బాగుంటుంది.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి