పెసర పప్పు పచ్చడి.
( కొద్ది మార్పులతో )
చాయపెసరపప్పు -- 100 గ్రాములు.
పచ్చిమిరపకాయలు -- 6
ఎండుమిరపకాయలు -- 2
జీలకర్ర -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
నిమ్మకాయ -- ఒకటి .
కట్ చేసుకుని రసము తీసుకోవాలి .
కొత్తిమీర -- చిన్న కట్ట
పోపుకు.
నెయ్యి -- రెండు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- రెండు
చాయమినపప్పు -- స్పూను
ఆవాలు -- అర స్పూను.
కరివేపాకు -- రెండు రెమ్మలు.
తయారీ విధానము .
ముందుగా చాయపెసరపప్పును ఒక గిన్నెలో వేసుకుని తగినన్ని నీళ్ళు పోసి రెండు గంటల సేపు నానబెట్టాలి.
తర్వాత నీరును వడకట్టు కోవాలి .
తర్వాత నానబెట్టిన చాయపెసరపప్పు , జీలకర్ర , పచ్చిమిర్చి , ఎండుమిర్చి , పచ్చి ఇంగువ , తరిగిన కొత్తిమీర వేసి , తగినన్ని నీరు పోసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని నిమ్మరసం వేసుకుని స్పూనుతో బాగా కలుపు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని రెండు ఎండుమిర్చి ముక్కలు చేసుకుని , చాయ మినపప్పు ,ఆవాలు మరియు కరివేపాకు వేసుకుని పోపు వేసుకుని పచ్చడిలో వేసుకుని, స్పూను తో బాగా కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment