ఆలూరుకృష్ణప్రసాదు .
కొత్తావకాయ. ( సాంపిల్ )
కావలసినవి .
మామిడి కాయలు - 2
కారం -- 50 గ్రాములు
ఆవపిండి -- 40 గ్రాములు
ఉప్పు -- 35 గ్రాములు
మెంతులు -- స్పూను
పసుపు -- స్పూను
నూనె -- 100 గ్రాములు
తయారీ విధానము .
మామిడి కాయలు కడిగి పొడి గుడ్డ పెట్టుకుని తడిలేకుండా తుడుచుకుని పై చెక్కు తీయకుండా మధ్యకు తరుగుకొని , మధ్యలో జీడి మరియు లోపల పొర తీసివేసి ముక్కలుగా తరుగుకోవాలి .
ఈ ముక్కలలో గరిటెడు నూనె , మొత్తము పసుపు వేసి చేతితో బాగా కలుపుకొని విడిగా ఉంచుకోవాలి .
ఒక బేసిన్ లో కారం , ఆవ పిండి , ఉప్పు మరియు మెంతులు వేసుకుని , చేతితో బాగా కలుపుకోవాలి .
అందులో కలిపిన ముక్కలు మరియు మొత్తము నూనె వేసుకుని బాగా కలుపుకుని ఒక సీసాలో తీసుకోవాలి .
మరుసటి రోజునుండి ఈ ఆవకాయ తిరగ కలిపి వాడుకోవచ్చు .
ఈ ఆవకాయ ఏప్రిల్ లో అసలు ఆవకాయలు పెట్టేవరకు అంటే రెండు నెలలు నిక్షేపంలా ఉంటుంది .
0 comments:
Post a Comment