మసాలా పెసర వడలు లేదా మసాలా పెసర పుణుకులు .
కావలసినవి.
పచ్చ పెసలు లేదా మామూలు పెసలు -- పావు కిలో
పచ్చిమిర్చి -- 12
అల్లం -- షుమారు రెండంగుళాలు ముక్క
పై చెక్కు తీసుకుని
ముక్కలు గా చేసుకోవాలి .
ఉల్లిపాయలు -- రెండు . సన్నని ముక్కలుగా తరుగు కొవాలి .
కరివేపాకు -- మూడు రెమ్మలు . సన్నగా తరుగు కోవాలి .
కొత్తిమీర -- ఒక కట్ట సన్నగా తరుగు కోవాలి .
పొదినా ఆకు అరకప్పు -- సన్నగా తరుగు కోవాలి .
ఉప్పు -- తగినంత
నూనె -- అర కిలో
తయారీ విధానము .
ముందుగా పెసలు సరిపడా నీళ్ళు పోసి నాలుగు గంటల సేపు నానబెట్టు కోవాలి .
ఆ తర్వాత నీళ్ళు వడకట్టు కోవాలి .
ఇప్పుడు గ్రైండర్ లో కాని మిక్సీ లో కాని నాన బెట్టిన పెసలు , పచ్చి మిర్చి , అల్లం ముక్కలు మరియు సరిపడ ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ గారెల పిండి మాదిరిగా గట్టిగా వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి .
ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు , తరిగిన కరివేపాకు , తరిగిన కొత్తిమీర మరియు తరిగిన పొదినా వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టుకుని మొత్తం నూనె పోసి నూనె పొగలు వచ్చే విధముగా కాగనివ్వాలి .
తర్వాత పిండిని అర చేతితో అద్దుకుని వడలు లాగా వేసుకుని బంగారు రంగులో వేయించుకోవాలి .
లేదా చిన్న చిన్న పుణుకులు లా వేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే మసాలా పెసర వడలు లేదా మసాలా పెసర పుణుకులు మధ్యాహ్నము అల్పాహారమునకు సిద్ధం .
ఈ వడలు లేదా పుణుకులు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని నంచుకుని తినవచ్చు .
చాలా రుచిగా ఉంటాయి .
0 comments:
Post a Comment