ఆలూరుకృష్ణప్రసాదు .
కొబ్బరి కారం / కొబ్బరి పొడి .
కావలసినవి .
ఎండు కొబ్బరి చిప్పలు --- 2
ఎండుమిరపకాయలు -- 15
జీలకర్ర -- స్పూనున్నర
వెల్లుల్లి పాయ రెబ్బలు -- 15
ఉప్పు -- తగినంత .
తయారీ విధానము .
ముందుగా స్టౌ వెలిగించి సెగ సిమ్ లో పెట్టుకోవాలి .
ఎండు కొబ్బరి చిప్పలు స్టౌ మీద పెట్టి వెనుక వైపు కొబ్బరి చిప్పలను మధ్య మధ్య తిప్పుతూ కమ్మని వాసన వచ్చేదాకా కాల్చుకోవాలి .
ఎక్కువ సెగన కాల్చుకుంటే చిప్పలు మాడి పోవచ్చును లేదా చిప్పలు అంటుకునే ప్రమాదం ఉంది .
కొబ్బరి చిప్పలు చల్లారగానే ఎండు కొబ్బరి తురుముతో తురుము కోవాలి .
లేదా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ఎండుమిరపకాయలు తొడిమలు తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా ఎండుమిరపకాయలు , జీలకర్ర వేసి మిరపకాయలు వేగిన వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .
వెల్లుల్లి పాయలు పై పొట్టు తీయకుండా రెబ్బలుగా వలుచుకోవాలి .
ఇప్పుడు మిక్సీలో వేగిన ఎండుమిరపకాయలు , జీలకర్ర , తగినంత ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు / లేక తురిమిన ఎండు కొబ్బరి మిక్సీ లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి .
చివరగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకోవాలి .
తర్వాత ఒక సీసాలో భద్రపర్చుకోవాలి .
వెల్లుల్లి ఇష్టం లేని వారు మరో అర స్పూను జీలకర్ర వేసుకుని చేసుకోవచ్చు .
ఈ కొబ్బరి పొడి షుమారు 20 రోజులు నిల్వ ఉంటుంది .
ఈ కొబ్బరి కారం లేదా కొబ్బరి పొడి వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment