ఆలూరుకృష్ణప్రసాదు .
ఉలవచారు.
చాలా మంది ఉలవచారు ఎలా తయారు చేయాలి ?
తయారీ విధానము తెలియ చేయండి అని అడుగుతున్నారు .
ఈ ఉలవచారు ఇష్టమైన వారికి ఉపయోగిస్తుందనే ఉద్దేశ్యంతో అందరికీ తెలియచేస్తున్నాను.
ఉలవచారు.
తయారీ విధానము .
ముందుగా ఉలవలని బాగా కడిగి సరిపడా నీరు పోసి 4 గంటలు నానబెట్టుకోవాలి .
తరువాత నానబెట్టిన ఉలవలను కుక్కర్ లో వేసి తగినంత నీరు పోసి 5 or 6 visitles వచ్ఛేవరకు ఉడకనివ్వాలి.
తర్వాత నీటిని వడబోసుకుని నీటి కట్టును విడిగా ఉంచుకోవాలి.
ఇపుడు ఒక పాన్ లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి నూనె వేడెక్కాక కాస్త పోపు దినుసులు...శనగ పప్పు..కొద్దిగా జీలకర్ర.వేసి వేగనివ్వాలి..
తర్వాత కాస్త పసుపు..కరివేపాకు రెమ్మలు వేసి ఇంతకు ముందు పక్కకు తీసి ఉంచిన ఉలవ కట్టు అందులో పోసి కాసేపు మరిగించాక చింతపండు రసం కానీ...టమాటో గ్రైండ్ చేసుకున్న ప్యూరి కానీ వేసి..కాస్త ఇష్టమున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చును.
ఇప్పుడు కొంచెం దనియా పొడి వేసుకుని కొంచెం మరిగాక కొత్తిమీర పైన వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి.
వేడి వేడి ఉలవ చారు రెడి..
తీసిపెట్టుకున్న ఉలవలు గుగ్గిళ్ళు గా పోపు వేసుకుని మగ్గపెట్టి ఉప్పు కారం వేసుకుని తినవచ్చును.
0 comments:
Post a Comment